Kara movie 3 days worldwide collections: తమిళ హీరో ధనుష్(Dhanush K Raja) నటించిన లేటెస్ట్ చిత్రం ‘కర'(Kara Movie) తెలుగు , తమిళం , హిందీ భాషల్లో రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. విడుదలకు ముందు థియేట్రికల్ ట్రైలర్ తో ఈ చిత్రం ప్రేక్షకుల్లో మంచి అంచనాలను ఏర్పాటు చేసుకుంది. సినిమాలో ఎదో బలమైన విషయం ఉన్నట్టు ఉందే, కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, ధనుష్ కి నటుడిగా మరోసారి మంచి పేరు తెచ్చిపెడుతుంది అంటూ ప్రతీ ఒక్కరు కామెంట్ చేశారు. విడుదల తర్వాత మొదటి రోజు మొదటి ఆట నుండే మంచి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది. కానీ అది కేవలం పైడ్ టాక్ అని ఈ చిత్రాన్ని చూసిన వాళ్ళు చెప్తున్న మాట. కలెక్షన్స్ లో కూడా అది స్పష్టంగా అర్థం అయిపోతుంది. మూడు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకసారి చూద్దాం.
ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాం ప్రాంతం నుండి 2 కోట్ల 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతం నుండి 2 కోట్ల 5 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి 4 కోట్ల 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 2 కోట్ల 10 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది. ధనుష్ గత చిత్రం ‘కుబేర’ కి మొదటి రోజున తెలుగు రాష్ట్రాల నుండి ఇంతకంటే రెండింతలు ఎక్కువ వసూళ్లు వచ్చాయి. కానీ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకునే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కేవలం 4 కోట్ల 50 లక్షల రూపాయలకు మాత్రమే జరిగింది.
మూడు రోజుల్లో 50 శాతానికి పైగా రీకవరీ సాధించింది కాబట్టి, లాంగ్ రన్ లో డీసెంట్ హోల్డ్ ని చూపించినా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోగలదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే తమిళనాడు నుండి 15 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి , కర్ణాటక నుండి 2 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , కేరళ నుండి 35 లక్షల రూపాయిలు , రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వాచినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఇక ఓవర్సీస్ నుండి అయితే ఈ చిత్రానికి 7 కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిందని , ఓవరాల్ గా ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు 14 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిందని అంటున్నారు.