Homeఎంటర్టైన్మెంట్Kara 12 Days Worldwide Collections: ధనుష్ 'కర' 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..హిట్...

Kara 12 Days Worldwide Collections: ధనుష్ ‘కర’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..హిట్ టాక్ తో ఈ రేంజ్ డిజాస్టర్ వసూళ్లు ఊహించలేదు..

Kara 12 Days Worldwide Collections: ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలకు కలెక్షన్స్ రాకపోవడం సహజమే , కానీ ఈ ఏడాది ఏంటో అసలు అర్థం కావడం లేదు , సూపర్ హిట్ , లేదా డీసెంట్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా కలెక్షన్స్ రావడం లేదు. ఇదే నిర్మాతలను, బయ్యర్స్ ని తీవ్రమైన మనోవేదనకు గురి చేస్తున్న విషయం. చిన్న సినిమాలకు ఇలాంటి సమస్యలు ఉంటే పర్వాలేదు, కానీ ధనుష్ లాంటి పాపులర్ హీరో సినిమాకు కూడా పాజిటివ్ టాక్ మీద కనీసం యావరేజ్ రేంజ్ కలెక్షన్స్ కూడా రావడం లేదంటే ఏమనుకోవాలి చెప్పండి.. ?, రీసెంట్ గానే ఆయన హీరో గా నటించిన ‘కర’ మూవీ భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ చిత్రానికి సోషల్ మీడియా నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం డిజాస్టర్ రేంజ్ లోనే వచ్చాయి. 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో చూద్దాం.

ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, ఆంధ్రా + సీడెడ్ ప్రాంతాల నుండి 3 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 6 కోట్ల 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 3 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో కోటి 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఇతర ప్రాంతాల విషయానికి వస్తే , తమిళనాడు లో ఈ చిత్రానికి 12 రోజుల్లో 28 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

ఇది చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఇక కర్ణాటక ప్రాంతం విషయానికి వస్తే 12 రోజుల్లో 3 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, కేరళ నుండి 60 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 40 లక్షలు, ఓవర్సీస్ నుండి 10 కోట్ల 60 లక్షలు , ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా అన్ని బాషల నుండి ఈ చిత్రానికి 50 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 24 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ఓవరాల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 17 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. మహా అయితే మరో కోటి రూపాయిల షేర్ మాత్రమే ఈ చిత్రానికి రాబోయే రోజుల్లో వస్తుందని, ఓవరాల్ గా కమర్షియల్ గా బిగ్గెస్ట్ డిజాస్టర్ అని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular