Dhanush: తమిళ స్టార్ హీరో ధనుష్ – ఆయన భార్య ఐశ్వర్య విడిపోతున్నారని ప్రకటించిన దగ్గర నుంచి ఈ వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే, ఇటు ధనుష్ అటు ఐశ్వర్య ఎవరి పనుల్లో వాళ్ళు బిజిగా ఉన్నారు. ధనుష్ తన ‘సార్’ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ధనుష్ కి జ్వరం రావడంతో షూట్ కి నిన్న, ఈ రోజు బ్రేక్ ఇచ్చారు.

ఇక ఐశ్వర్య విషయానికి ఆమె హైదరాబాద్ కి వచ్చింది. భర్తకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఆమె రావడం లేదు. ఆమె ప్రస్తుతం ఒక లవ్ సాంగ్ ను చిత్రీకరించడానికి వస్తోంది. ఐశ్వర్యకి మొదటి నుంచి డైరెక్షన్ అంటే బాగా ఇష్టం. ఆమె గతంలో తన మాజీ భర్త ధనుష్ ను హీరోగా పెట్టి ‘3’ అనే సినిమాలో కూడా నటించింది. అప్పట్లో ధనుష్ పాడిన ‘కొలవరి’ పాట బాగా వైరల్ కూడా అయింది. ఆ పాట ఐశ్వర్య తీసిన ‘3’ సినిమాలోనిదే.
Also Read: ప్రభాస్ యూరప్ ట్రిప్ ముగిసింది.. ఇక మీనాక్షి చౌదరితో రొమాన్స్ కి రెడీ !
కాగా ఐశ్వర్య ప్రస్తుతం మరో సినిమా తీసే పనుల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఐశ్వర్య ‘వాలెంటైన్ డే’ నాడు రిలీజ్ చేయడానికి తన సినిమాలోని ఒక పాటను చిత్రీకరిస్తుంది. రామోజీ ఫిలిం సిటీలో ఈ పాట షూటింగ్ జరగబోతుంది. ఇక ఐశ్వర్య మీడియా కంట బడిన ఆమె ధనుష్ గురించి, డివోర్స్ గురించి మాత్రం స్పందించలేదు. ఐశ్వర్య కూడా తన సినీ కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లు అర్ధం అవుతుంది.

అయితే, ధనుష్, ఐశ్వర్యల డివోర్స్ ఇష్యూ పై ధనుష్ తండ్రి ‘కస్తూరి రాజా’ రీసెంట్ గా ఓకే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి చాలా సర్వ సాధారణం అని అందరికి తెలుసు. అయితే, ధనుష్, ఐశ్వర్యల మధ్య కూడా అలాంటి గొడవలే జరిగాయి. అయితే నేను వారిద్దరితో మాట్లాడటం జరిగింది. ఇక రజినీకాంత్ కూడా వారి విడాకుల నిర్ణయాన్ని వెనుక్కి తీసుకోవాలని కోరారు.
రజినీకాంత్ కోరిక మేరకు వాళ్ళు కూడా తమ విడాకుల నిర్ణయం పై మరోసారి పరిశీలిస్తామని తెలిపారు. కాబట్టి వారిద్దరూ త్వరలోనే మళ్ళీ కలుస్తారు అని మాకు నమ్మకం ఉంది’ అని కస్తూరి రాజా క్లారిటీగా చెప్పుకొచ్చాడు. మరి రజనీకాంత్, కస్తూరి రాజాల కోసం అయినా ధనుష్, ఐశ్వర్యలు తమ విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా ? చూడాలి. ధనుష్‌తో ఐశ్వర్యకు 2004 నవంబర్ 18న వివాహం జరిగింది.
Also Read: ‘మహేష్’ మరదలిగా ‘రానా’ హీరయిన్ ఖరారు
[…] […]
[…] Akhanda in Tamil: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా మేనియా తమిళంలో పాకబోతుంది. మొత్తమ్మీద బాలయ్య అఘోరాగా కనిపించి, అభిమానులను ఎంతగానో అలరించాడు. కాగా ఈ క్రేజీ సూపర్ హిట్ సినిమా అఖండ. 50 రోజులు నిర్విరామంగా ఆడింది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ లో ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. […]