Yamadonga : ఎన్టీఆర్(Junior NTR) పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 18 వ తారీఖున ఆయన కెరీర్ లో ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ‘యమదొంగ'(Yamadonga) చిత్రాన్ని గ్రాండ్ గా రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటి వరకు విడుదలైన రీ రిలీజ్ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టేస్తుందని అభిమానులు అనుకున్నారు. కానీ అనూహ్యంగా మొదటి రోజు దారుణమైన ఆక్యుపెన్సీలు నమోదు అవ్వడంతో ఫ్యాన్స్ కంగుతిన్నారు. ఇదేంటి రికార్డు రేంజ్ గ్రాస్ వస్తుందని అనుకుంటే కనీసం కోటి రూపాయిల గ్రాస్ కూడా రాలేదు అని బాధపడ్డారు. రీ రిలీజ్ హిస్టరీ లోనే యమదొంగ ఆల్ టైం డిజాస్టర్ ఫ్లాప్ అని సోషల్ మీడియా లో ఎన్టీఆర్ దురాభిమానులు కామెంట్స్ చేశారు. కానీ ఎన్టీఆర్ పుట్టినరోజున, అనగా మే 20న ఈ చిత్రం అత్యధిక ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఎన్టీఆర్ కి కంచు కోటలుగా పిలవబడే గుంటూరు, కృష్ణ, సీడెడ్ వంటి ప్రాంతాల్లో మొదటి రోజు వచ్చిన గ్రాస్ వసూళ్లను చూసి ఫ్యాన్స్ కి మతి పోయింది. కనీసం ఒక్క సెంటర్ లో కూడా లక్ష రూపాయిల గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకోలేదు. కానీ ఈ సెంటర్స్ లో మే 20న భారీ స్థాయిలో హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకొని, ఆ సెంటర్స్ ని ఎందుకు ఎన్టీఆర్ కంచుకోటలు అంటారో అందరికీ మరోసారి అర్థం అయ్యేలా చేసింది. ఉదాహరణకు అనంతపురం సిటీ ని తీసుకుందాం. ఇక్కడ ఈ చిత్రానికి మే 18న కేవలం 78 వేల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ మే 20న ఏకంగా రెండు లక్షలకు పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీనిని బట్టి ఎన్టీఆర్ అభిమానులు మే 18న కాకుండా కేవలం తమ అభిమాన హీరో పుట్టినరోజు నాడు మాత్రమే ఈ సినిమాని చూసినట్టు తెలుస్తుంది.
Also Read : ‘యమదొంగ’ రీ రిలీజ్ మొదటి రోజు వసూళ్లు..ఇంతటి డిజాస్టర్ రెస్పాన్స్ ఊహించలేదు!
యమదొంగ చిత్రం టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్ చిత్రమేమి కాదు. కేవలం ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా. రాజమౌళి కెరీర్ లో బలహీనమైన సబ్జెక్టు ఇదేనని స్వయంగా రాజమౌళి ఎన్నో సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కేవలం ఎన్టీఆర్ అద్భుతమైన నటన, డ్యాన్స్ కారణంగానే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని అంటుంటాడు. పెద్దగా క్లాసిక్ విలువలు లేని సినిమా కాబట్టే, ఈ చిత్రానికి సాధారణ ఆడియన్సు కదలలేదని, కేవలం అభిమానులు మాత్రమే చూసారని అంటున్నారు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడ్ రోజులకు కలిపి 2 కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆల్ టైం రికార్డు కి చాలా దూరం కానీ, ఎన్టీఆర్ స్టార్ పవర్ కారణంగా ఫ్యాన్స్ పరువు తీయకుండా డీసెంట్ స్థాయి గ్రాస్ తో సరిపెట్టింది.