Dhanush Beggar Look Kubera: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల (Shekar Kammula)…ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి మంచి గుర్తింపును సంపాదించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాయి. ఇక ఇప్పటివరకు ఈయన చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తూ ఉండడం విశేషం…ప్రస్తుతం ఆ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకోవడమే కాకుండా భారీ కలెక్షన్లను కూడా కొల్లగొడుతోంది. మొదటి రోజు 30 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ కలెక్షన్స్ ను అందుకోవడం పక్క అంటూ చాలా మంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఈ సినిమాలో ధనుష్ (Dhanush) బిచ్చగాడి క్యారెక్టర్ లో నటించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ పాత్రలో తను తప్ప వేరే ఎవరు నటించలేరని ఆయనను మించిన నటుడు మరొకరు లేరు అంటూ అతనికి విపరీతమైన ప్రశంసలైతే దక్కుతున్నాయి. నిజానికి బిచ్చగాడు పాత్ర అనగానే తెలుగులో ఉన్న స్టార్ హీరోలు ఎవరు కూడా నటించడానికి అయితే ఆసక్తి చూపించరు. ఎందుకంటే వాళ్లకున్న ఇమేజ్ తగ్గుతుందని బిచ్చగాడి పాత్రలో వాళ్ళను వాళ్ళు ఊహించుకోలేమని చెబుతూ ఉంటారు.
కానీ ధనుష్ (Dhanush) మాత్రం సినిమా కోసం ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆయన డిఫరెంట్ పాత్రల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు. తన ఇమేజ్ గురించి అసలు పట్టించుకోడు. మంచి సినిమా మంచి పాత్ర చేయడానికి తను అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు.
ఇక ఈ క్రమంలోనే ఆయన నుంచి గొప్ప గొప్ప పాత్రలైతే బయటకు వస్తున్నాయి. ఆయన ఇప్పటివరకు చేసిన చాలా సినిమాల్లో అతనికి చాలా అవార్డులు కూడా వరించాయి… ఇక కుబేర సినిమాలో మొదట ధనుష్ కనిపించినప్పుడు నిజంగా మనం ఒక బిచ్చగాడిని చూస్తున్నామా అనే ఒక ట్రాన్సులోకి వెళ్లి పోతాము.
ధనుష్ బిచ్చగాడి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించి మెప్పించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఆయన ఏ పాత్రనైనా సరే చాలా డెడికేటెడ్ గా చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు అందువల్లే ఆయనకు చాలా మంచి గుర్తింపైతే వస్తుంది…