Dhanush Addicted To Watches: సౌత్ ఇండియా లో బిగ్గెస్ట్ స్టార్స్ లిస్ట్ తీస్తే అందులో ధనుష్(Dhanush K Raja) పేరు కచ్చితంగా ఉంటుంది. సూపర్ హిట్స్ కొట్టడం లో కానీ, నటనలో కానీ ధనుష్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. తమిళం తో పాటు, తెలుగు , హిందీ మరియు ఇతర భాషల్లో ఆయనకు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఇలా ఇతర భాషల్లో సూపర్ హిట్స్ ని అందుకున్న హీరోలు మన సౌత్ నుండి చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో ఒకరు ధనుష్. మన తెలుగు లో ఈయన హీరో గా నటించిన ‘సార్’, ‘కుబేర’ చిత్రాలు కమర్షియల్ గా ఎంత బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిల్చాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు యూత్ ఆడియన్స్ కి ధనుష్ సినిమా అంటే ఒక బ్రాండ్ గా మారిపోయింది.
ఇదంతా పక్కన పెడితే ధనుష్ ఒక్కో సినిమాకు ప్రస్తుతం 40 నుండి 50 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ ని అందుకుంటూ ఉన్నాడు. ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం గ్యారంటీ రేంజ్ లో ఆడడం తో పాటు, డిజిటల్, సాటిలైట్ మరియు ఆడియో రైట్స్ కూడా భారీ రేంజ్ కి అమ్ముడుపోతుండడం వల్ల ధనుష్ అడిగినంత డబ్బులు ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడడం లేదు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆయన పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తానూ ప్రస్తుతం ధరించి ఉన్న వాచీ విలువ రెండున్నర కోట్ల రూపాయిల వరకు ఉంటుందని చెప్పుకొచ్చాడు. మొదటి నుండి వాచీలు అంటే విపరీతమైన ఇష్టమున్న ధనుష్ ఇంట్లో పెద్ద వాచీల కలెక్షన్ ఉండదట. వాటి అన్నిటి విలువ ని లెక్కగడితే 60 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. వచ్చేలా విలువే ఇంత ఉంటే, ఇక ఆయన కార్ల కలెక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్ గానే ఆయన నుండి ఇడ్లీ కొట్టు అనే చిత్రం విడుదలైంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 70 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టింది. కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు కానీ, నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యాక పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. విడుదలైన 5 రోజుల్లోనే 52 లక్షల వ్యూస్ ని సొంతం చేసుకొని చరిత్ర సృష్టించింది. తమిళం లో ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా ఇంత వ్యూస్ రాలేదు. రెండు వారాల్లో 80 లక్షలకు పైగా వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, ఓవరాల్ గా కోటి కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకొని డిజిటల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది ఈ చిత్రం.