Balakrishna New Movie: నందమూరి నటసింహం గా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య… ఆయన ప్రస్తుతం సీనియర్ హీరోలందరిలో టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఆయన చేసిన సినిమాలన్ని ఆయనకి గొప్ప విజయాన్ని సంపాదించి పెట్టినవే కావడం విశేషం… ఇక ఇప్పటి వరకు బాలయ్య వరుసగా మాస్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు…ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో హిస్టారికల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. అందులో ఒకటి నార్మల్ గెటప్ కాగా, మరొకటి యుద్దవీరుడి గెటప్ కావడం విశేషం…ఈ క్యారెక్టర్ లో బాలయ్య రౌడీల రక్తాన్ని ఏరులై పారించబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక బాలయ్య ఈసారి తన నట విశ్వ రూపాన్ని చూపించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు… ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలకు గొప్ప గుర్తింపైతే దక్కుతోంది… ఇక ప్రస్తుతం గోపీచంద్ మలినేని ఈ సినిమా స్టార్ట్ చేశాడు.
కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆగిపోయిందనే వార్తలు వచ్చినప్పటికి అవన్నీ ఫేక్ అంటూ సినిమా యూనిట్ కొట్టిపారేసింది. ఇక వీలైనంత తొందరగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలనే ఉదేశంలో బాలయ్య బాబు ఉన్నట్టుగా తెలుస్తోంది… ఇక బాలయ్య ను ఒక వారియర్ గా భారీ రేంజ్ లో చూపిస్తే మాత్రం గోపీచంద్ మలినేని సైతం టాప్ డైరెక్టర్ గా వెలుగొందుతాడు.
అలాగే బాలయ్య బాబుకి గొప్ప విజయాన్ని అందించిన దర్శకుడిగా హిస్టరీ లో నిలిచిపోతాడు. ఇంతకుముందే వీళ్ళ కాంబినేషన్ లో వీర సింహరెడ్డి అనే సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాతో అటు బాలయ్య, ఇటు గోపీచంద్ మలినేని భారీ విజయాన్ని సాధించి వాళ్ళకంట ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా?
లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇప్పటి వరకు బాలయ్య తన కెరియర్ లో ఎన్నో గొప్ప పాత్రలు చేసిన కూడా ఇందులో ఆయన చేస్తున్న వారియర్ క్యారెక్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం గుర్తుండిపోతోంది అంటూ డైరెక్టర్ చెబుతుండటం విశేషం…