https://oktelugu.com/

Dhanush 3 Movie Special Shows: పోకిరి స్పెషల్ షోస్ రికార్డు ని బద్దలు కొట్టబోతున్న ధనుష్ ‘3’ స్పెషల్ షోస్ ?

Dhanush 3 Movie Special Shows: ఈమధ్య కాలం లో స్పెషల్ షోస్ ట్రెండ్ ఊపు అందుకుంది..కొత్త సినిమా విడుదలైతే థియేటర్స్ ముందు జనాలు ఎలా అయితే ఉంటారో..ఇప్పుడు పాత సినిమాలను రీ మాస్టర్ చేయించి థియేటర్స్ లో విడుదల చేసి మళ్ళీ థియేటర్స్ అన్ని కళకళలాడిపొయ్యేలా చేస్తున్నారు బయ్యర్స్..ఆగస్టు 9 వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా వేసిన పోకిరి సినిమా స్పెషల్ షోస్ కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 9, 2022 / 08:54 AM IST
    Follow us on

    Dhanush 3 Movie Special Shows: ఈమధ్య కాలం లో స్పెషల్ షోస్ ట్రెండ్ ఊపు అందుకుంది..కొత్త సినిమా విడుదలైతే థియేటర్స్ ముందు జనాలు ఎలా అయితే ఉంటారో..ఇప్పుడు పాత సినిమాలను రీ మాస్టర్ చేయించి థియేటర్స్ లో విడుదల చేసి మళ్ళీ థియేటర్స్ అన్ని కళకళలాడిపొయ్యేలా చేస్తున్నారు బయ్యర్స్..ఆగస్టు 9 వ తేదీన సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా వేసిన పోకిరి సినిమా స్పెషల్ షోస్ కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..అలా అదే ట్రెండ్ ని కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా వేసిన జల్సా సినిమా స్పెషల్ షోస్ కి పోకిరి కి మించి డబుల్ రెస్పాన్స్ వచ్చింది..పోకిరి సినిమా స్పెషల్ షోస్ కోటి 72 లక్షల రూపాయిలు గ్రాస్ వస్తే, జల్సా సినిమా కి మూడు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఈ రెండు సినిమాల రీ రిలీజ్ లు అద్భుతంగా వర్కౌట్ అవ్వడం తో ఇప్పుడు మరికొన్ని సినిమాలు రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి.

    Dhanush 3 Movie Special Shows

    ఇక ఈరోజు పదేళ్ల క్రితం విడుదలైన ధనుష్ – శృతి హాస్సన్ మూవీ ‘3 ‘ ,ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక షోస్ తో మరోసారి విడుదలైంది..’వై థిస్ కొలవెరి’ సాంగ్ ఉండేది ఇందులో..అప్పట్లో ఈ పాట భారత దేశాన్ని ఎలా ఊపేసిందో మన అందరికి తెలిసిందే..ఈ ఒక్క పాట మాత్రమే కాదు..ఈ సినిమాలోని మిగిలిన పాటలు కూడా బంపర్ హిట్ అయ్యాయి..కానీ అప్పట్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రం ఆశించిన స్థాయి లో ఆడలేదు.

    Dhanush 3 Movie Special Shows

    కమర్షియల్ ఫెయిల్యూర్ గానే నిలిచింది..అలాంటి సినిమాని ఇప్పుడు రీ రిలీజ్ చెయ్యగా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ పడ్డాయి..ఈ సినిమాకి వస్తున్నా ఫుల్స్ చూస్తుంటే పోకిరి సాధించిన స్పెషల్ షోస్ గ్రాస్ కోటి 72 లక్షల రూపాయిలను అతి తేలికగా క్రాస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు..కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే కాదు..ఈ సినిమా ఈ వీకెండ్ మొత్తం థియేటర్స్ లో ఉంటుంది..చూడాలిమరి ఈ సినిమా పోకిరి క్రాస్ చేస్తుందా..లేదా పోకిరి ని క్రాస్ చేసి జల్సా రికార్డు ని కూడా బద్దలు కొట్టేస్తుందా అనేది.

    Tags