Devi Sri Prasad : ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే 24 క్రాఫ్ట్స్ లో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ పనిని సక్రమంగా చేయాల్సిన అవసరమైతే ఉంది. ఏ ఒక్కరి పనితీరు సరిగ్గా లేకపోయినా కూడా సినిమా మీద భారీ ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మ్యూజిక్ అనేది ఒక సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్స్ ను అందించిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్… ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న విషయం మనకు తెలిసిందే…అయితే ఈ మధ్య ఆయన మ్యూజిక్ లో కొంతవరకు టచ్ అయితే పోయింది. ఒకప్పుడు ఆయన నుంచి వచ్చే సాంగ్స్ ప్రేక్షకులను అలరించాడమే కాకుండా ఒక సినిమాకు సంబంధించిన ఆల్బమ్ మొత్తం సూపర్ హిట్ సాంగ్స్ అయితే ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటి మ్యాజిక్ ని తను రిపీట్ చేయలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా ఆయన చేసే మ్యూజిక్ లో క్వాలిటీ అయితే మిస్ అవుతుంది. దానివల్ల ప్రేక్షకులు దేవి శ్రీ ప్రసాద్ నుంచి వినసొంపైన మ్యూజిక్ పొందలేకపోతున్నారు. తద్వారా వాళ్లు సినిమా మీద పెట్టుకున్నా అంచనాలకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ రీచ్ అవ్వలేకపోతుంది. తద్వారా ఈ ఎఫెక్ట్ అనేది సినిమా మీద పడుతుంది. ఈమధ్య తన మ్యూజిక్ లో మ్యాజిక్ ఎందుకు తగ్గించాడనేది ఎవ్వరికి అర్థం కావడం లేదు. నిజానికి చాలామంది స్టార్ డైరెక్టర్లు మొదట్లో దేవిశ్రీప్రసాద్ తోనే మ్యూజిక్ ని చేయించుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. కారణం ఏంటి అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడున్న జనాల అభిప్రాయాలకు అనుగుణంగా మ్యూజిక్ ని అందించడంలో దేవిశ్రీప్రసాద్ చాలావరకు వెనకబడిపోయాడంటూ కొన్ని వార్తలైతే వినిపిస్తున్నాయి.
అయినప్పటికి సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ మాత్రం దేవిశ్రీ ప్రసాద్ కే ఎక్కువ అవకాశాలు ఇస్తూ అతన్ని ప్రోత్సహిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒక సుకుమార్ తప్ప మిగిలిన ఏ స్టార్ డైరెక్టర్ కూడా దేవిశ్రీప్రసాద్ కి అవకాశం అయితే ఇవ్వడం లేదు.
ఇక కారణం ఏదైనా కూడా దేవి ఇక మీదట మంచి మ్యూజిక్ ని ఇస్తూ తన పూర్వపు ఫామ్ ను అందుకునే ప్రయత్నం అయితే చేయాలి. లేకపోతే మాత్రం ఆయన మ్యూజిక్ అవుడేటెడ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. తద్వారా పెద్ద అవకాశాలను కూడా కోల్పోయే ఛాన్సులైతే ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ డైరెక్టర్లు దేవిశ్రీప్రసాద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలంటే మాత్రం ఆయన భారీగా మారాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ జనరేషన్ మెప్పించే విధంగా మ్యూజిక్ ని అందిస్తూ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది…