DSP vs Anirudh: దేవి శ్రీ ప్రసాద్ vs అనిరుధ్ వీళ్ళలో ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు..?

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వాళ్లలో దేవీశ్రీ ప్రసాద్,అనిరుధ్ లు మొదటి స్థానం లో ఉన్నారు.

Written By: Gopi, Updated On : May 11, 2024 3:33 pm

Devi Sri Prasad vs Anirudh

Follow us on

DSP vs Anirudh: ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే అందులో మ్యూజిక్ అనేది చాలా కీలకపాత్ర వహిస్తుంది. ముఖ్యంగా ఒక సీన్ ఎలివేట్ అవ్వాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. అలా ఉంటేనే ఆ సీన్ ప్రేక్షకులకు నచ్చుతుంది తద్వారా సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. అలాగే ఒక సినిమా ప్రేక్షకుడిని థియేటర్లోకి రప్పించాలంటే ఆ సినిమాలోని సాంగ్స్ ప్రేక్షకుడికి నచ్చితే కనీసం సాంగ్స్ చూడడానికైనా ప్రేక్షకులు థియేటర్ కు వస్తారు. ఇక ఒకప్పుడు సినిమాల్లో మంచి సాంగ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు అంతా రిపీటెడ్ మ్యూజిక్ లో సాంగ్స్ కొడుతూ అదే మ్యూజిక్ అంటూ ప్రేక్షకులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న వాళ్లలో దేవీశ్రీ ప్రసాద్,అనిరుధ్ లు మొదటి స్థానం లో ఉన్నారు.ఇక తమన్ కూడా వీళ్లతో పోటీ పడుతున్నప్పటికీ ఆయన చేసేవి మొత్తం కాపీ సాంగ్స్ కాబట్టి ఆయన్ని వీళ్ళతో పోటీకి మనం పరిగణలోకి తీసుకోక పోవడమే బెటర్…

ఇక ఈ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. దేవి పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో మరోసారి అదే హవాను కొనసాగించాలని చూస్తున్నాడు… ఇక అనిరుధ్ సైతం విక్రమ్, జైలర్ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రతిష్ట లను సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు దేవర సినిమాతో మరోసారి సినిమా ప్రేక్షకులను తన మ్యూజిక్ ప్రపంచంలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

అయితే ఈ ఇద్దరిలో ఎవరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనేది తెలియాలంటే పుష్ప 2, దేవర ఈ రెండు సినిమాలు రిలీజ్ అయి ఎవరి ఆల్బమ్ సూపర్ సక్సెస్ అవుతుందో వాళ్లే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లుగా నిలుస్తారు. వీరిద్దరిలో ఎవరు బెస్ట్ అనేది చెప్పడం చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు రాబోయే సినిమాలతో వీళ్ళలో ఎవరు బెస్ట్ అనేది ఆయా సినిమాలా సాంగ్స్ నిర్ణయిస్తాయని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…