https://oktelugu.com/

OG Movie: ఓజీ నుంచి రాబోయే సాంగ్స్ కూడా కాపీ ట్యూన్స్ యేనా..? తమన్ ఇలా అయితే కష్టం భయ్యా…

ప్రస్తుతం ఆయన ఓజీ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రతి ప్రేక్షకుడిని అలరించింది. అలాగే 'హంగ్రీ చీతా' అనే సాంగ్ కూడా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను పొందింది.

Written By:
  • Gopi
  • , Updated On : May 11, 2024 / 03:29 PM IST

    Are the upcoming songs from OG movie also copy tunes

    Follow us on

    OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చేసిన ఒక సంచలనంగా మిగిలిపోతుందనే చెప్పాలి. ఆయన సినిమాల్లో “ట్రెండ్ ఫాలో అవ్వరు ట్రెండ్ సెట్ చేస్తారు”. ఆయనను స్క్రీన్ మీద చూడడానికి ఆయన అభిమానులు అమితంగా ఇష్టపడుతూ ఉంటారు. అందుకే ఆయన రాజకీయాల్లోకి వెళ్లిన కూడా తన అభిమానులను ఉత్సాహ పరచడానికి సమయం దొరికిన ప్రతిసారి కనీసం సంవత్సరానికి ఒక సినిమా అయిన చేయాలనే కాన్సెప్ట్ తో ముందుకు వెళ్తున్నాడు.

    ఇక అందులో భాగంగానే ఆయన సినిమాలు చేస్తూ వాటిని రిలీజ్ చేస్తూ పెద్ద ఎత్తున సక్సెస్ లను కూడా సాధిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ఓజీ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రతి ప్రేక్షకుడిని అలరించింది. అలాగే ‘హంగ్రీ చీతా’ అనే సాంగ్ కూడా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను పొందింది. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వ్యవహరిస్తున్నాడు. ఇక హంగ్రీచీతా అనే సాంగ్ మ్యూజిక్ ని హాలీవుడ్ మ్యూజిక్ నుంచి కాపీ చేశారంటూ అప్పట్లో వార్తలైతే వచ్చాయి.

    ఇక ఇది పక్కన పెడితే గ్లింప్స్ లో వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ ని కూడా తమన్ కమలహాసన్ హీరోగా వచ్చిన విక్రమ్ సినిమా నుంచి కాపీ చేశాడు అంటూ విపరీతమైన ట్రోల్స్ ని కూడా ఎదుర్కొన్నాడు. ఇక ఈ సినిమా అనే కాకుండా తమన్ మ్యూజిక్ ఇచ్చిన ప్రతి సినిమా సాంగ్స్ తో కూడా కాపీ ట్యూన్స్ అనే విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

    ఇక ఇదిలా ఉంటే ఓజీ నుంచి రాబోయే సాంగ్స్ అన్నీ కూడా కొన్ని తెలుగు, కొన్ని తమిళ్ సినిమాల మ్యూజిక్ ని కాపీ చేసి సాంగ్స్ చేశాడు అంటూ సినిమా యూనిట్ నుంచి వార్తలైతే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఆ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక ఓజి సినిమా సాంగ్స్ బయటికి వస్తేనే అవి కాపీ ట్యూన్సా లేదా ఒరిజినల్ ట్యూన్సా అనే విషయం మీద క్లారిటీ వస్తుంది…