Devi Sri Prasad Career: ట్రెండ్ కి తగ్గట్టు మ్యూజిక్ ని అందించడం అనేది ఏ మ్యూజిక్ డైరెక్టర్ కి అయినా పెద్ద సవాల్. అలా ట్రెండ్ కి తగ్గట్టు అప్డేట్ అవుతూ, మ్యూజిక్ ని అందించే మ్యూజిషియన్స్ మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నారు. అప్డేట్ అవ్వని వాళ్ళు కనుమరుగు అయిపోతున్నారు. దాదాపుగా 3 దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న దేవి శ్రీ ప్రసాద్ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది ఇప్పుడు. రీసెంట్ గా ఆయన సంగీతం అందించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లోని పాటలు ఎంత నాసిరకంగా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎప్పుడో 2010 సంవత్సరం లో కొట్టాల్సిన పాటలని ఇప్పుడు కొట్టాడని, ఇప్పటి యూత్ ఇలాంటి పాటలు అసలు ఇష్టపడరని , దేవిశ్రీప్రసాద్ అసలు అప్డేట్ అయ్యేలా లేడని , ఇలా ఎన్నో రకాల విమర్శలు ఆయనపై వచ్చాయి.
అసలు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి విడుదలకు ముందు కావాల్సినంత హైప్ రాకపోవడానికి ప్రధాన కారణం దేవి శ్రీ ప్రసాద్ అని పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ఈకాలం లో ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే కచ్చితంగా పాటలు బాగుండాలి, అప్పుడే ఆడియన్స్ సినిమాలకు కదులుతున్నారు , అలాంటిది ఆ రేంజ్ నాసికరమైన పాటలు ఇస్తే ఎలా అంటూ మండిపడుతున్నారు. అంతే కాదు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయం లో కూడా దేవిశ్రీప్రసాద్ తీవ్ర స్థాయిలో నిరాశపరుస్తున్నాడు. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నచ్చక ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం ఆయన్ని తప్పించి థమన్ ని తీసుకున్న ఘటన ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం ఈ ఒక్క సినిమా విషయం లోనే కాదు, గతం లో కూడా ‘పుష్ప 2’ విషయం లో ఇదే జరిగింది.
సుకుమార్ దేవి శ్రీప్రసాద్ నుండి ది బెస్ట్ ఔట్పుట్ ని రాబట్టుకోవడం లో దిట్ట, ఆయనే ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని వేరే మ్యూజిక్ డైరెక్టర్ సంప్రదించాడు అంటే దేవిశ్రీప్రసాద్ పని అయిపోయినట్టే లెక్క. తన ప్రతీ సినిమాకు దేవిశ్రీప్రసాద్ లేనిదే సినిమా చెయ్యని సుకుమార్, ఇప్పుడు త్వరలో రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ ని తీసుకోవడం లేదట. ‘ధురంధర్’, ‘ధురంధర్ 2’ చిత్రాలతో నేషనల్ లెవెల్ లో తన అద్భుతమైన మ్యూజిక్ తో మూవీ లవర్స్ ని మంత్రముగ్దులను చేసిన శశ్వత్ సచ్ దేవ్ తో చర్చలు జరుపుతున్నారట. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవిశ్రీ ప్రసాద్ శకం ముగినసినట్టే అనుకోవాలి. ఈ విషయం ఆయనకు కూడా అర్థం అయ్యినట్టు ఉంది, అందుకే హీరో గా ‘ఎల్లమ్మ’ చిత్రం తో గ్రాండ్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు. ఆయన సరికొత్త ఇన్నింగ్స్ రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుందో చూడాలి.
