Peelings video song ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి అందరికి తెలిసిందే. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సినిమా మేనియా నే కనిపిస్తుంది. ఒక పక్క టికెట్స్ కోసం పెద్ద యుద్ధమే జరుగుతుంటే, మరోపక్క ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం మూవీ టీం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంది. రేపు హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చేయబోతున్నారు. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ ఏమి మాట్లాడబోతున్నాడు అనేది అభిమానులు, ప్రేక్షకులు ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే కాసేపటి క్రితమే ఇండియా మొత్తం ఊగిపోయే రేంజ్ సాంగ్ ని ‘పుష్ప 2’ టీం విడుదల చేసింది. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ విన్న తర్వాత అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు.
‘పీలింగ్స్’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్ ని దేవిశ్రీ ప్రసాద్ చాలా క్యాచీ గా, విన్న వెంటనే ఊగిపోయే రేంజ్ లో అందించాడు. అయితే ఈ బీట్స్ మొత్తం ఎక్కడో తమిళ సినిమాలో విన్నట్టుగా ఉందే అని కొంతమంది ఆడియన్స్ కి అనిపించొచ్చు. మంచి క్యాచీ ట్యూన్ ఇచ్చినప్పుడు ఇలాగే అనిపిస్తుంది. మాస్ కి మాత్రం ఈ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ ని దద్దరిల్లిపోయేలా చేస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ నుండి ఈ రేంజ్ మాస్ స్టెప్పులు చూసి అభిమానులు చాలా కాలం అయ్యింది. పుష్ప ‘నా సామీ’ పాటలో వేస్తాడు కానీ, ఈ రేంజ్ మాస్ స్టెప్పులు మాత్రం వెయ్యలేదు. మూడేళ్ళ తర్వాత తమ అభిమాన హీరోని ఎలా అయితే చూడాలని కోరుకున్నారో, అలా చూపించాడు డైరెక్టర్ సుకుమార్. ఈ పాట కేవలం తెలుగు ఆడియన్స్ కి మాత్రమే కాదు, ఇతర బాషల ఆడియన్స్ కి కూడా తెగ నచ్చేస్తుంది.
మరోపక్క దేవిశ్రీ ప్రసాద్ ని నిర్మాతలు అనేక విషయాల్లో అవమానించిన సంగతి తెలిసిందే. ఆయన ఎంత బాధ పడుంటే స్టేజి మీద నిర్మాతలపై అసహనం వ్యక్తం చేస్తారో మీరే ఊహించుకోండి. ఇంత మంచి సాంగ్స్ ఇస్తే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం దేవిశ్రీ ప్రసాద్ ని తప్పించి థమన్ ని పెట్టుకోవడం సుకుమార్ పొగరు కి నిదర్శనం అంటూ సోషల్ మీడియా లో దేవిశ్రీ ప్రసాద్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ లిరికల్ వీడియో సాంగ్ కచ్చితంగా యూట్యూబ్ లో వందల కొద్దీ మిలియన్ వ్యూస్ ని సాదిస్తుందని అభిమానులు బలమైన విశ్వాసంతో ఉన్నారు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన మొదటి కాపీ ని కాసేపటి క్రితమే కొంతమంది మీడియా ప్రముఖులకు వేసి చూపించారట. రెస్పాన్స్ వాళ్ళ నుండి అదిరిపోయే రేంజ్ లో వచ్చిందని అంటున్నారు . మరి ఆడియన్స్ నుండి కూడా ఆ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.