Devi Sri Prasad Yellamma Movie: ‘బలగం’ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ వేణు రాసుకున్న కథ ‘ఎల్లమ్మ'(Yellamma Movie). బలగం చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు(Dil Raju) నే, ఈ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. కానీ డైరెక్టర్ వేణు(Venu Yeldandi) ఏ ముహూర్తం లో ఈ సినిమా కథ ని రాసుకున్నాడో తెలియదు కానీ, ఇప్పటి వరకు ఈ చిత్రం సెట్స్ మీదకు మాత్రం వెళ్లలేకపోయింది. ముందుగా ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్(Natural Star Nani) నాని తో చేద్దామని అనుకున్నారు. ఆయనకు కథ వినిపించగా తెగ నచ్చింది, చేద్దాం కానీ, ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ పూర్తి అవ్వాలి అనడం తో, ఈ ప్రాజెక్ట్ ఆయన చేతుల్లో నుండి హీరో నితిన్(Actor Nithin) కి చేరింది. ‘తమ్ముడు’ సినిమా పెద్ద హిట్ అయ్యుంటే నితిన్ తోనే ఈ చిత్రాన్ని నిర్మించేవాడేమో దిల్ రాజు. కానీ ఆ సినిమా ఘోరమైన డిజాస్టర్ అవ్వడంతో నితిన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పించాడు.
ఆ తర్వాత తమిళ హీరో కార్తీ తో ఈ చిత్రం చేసే ప్రయత్నం చేశారు కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో హీరో గా ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) ఫైనల్ అయ్యినట్టు తెలుస్తుంది. పదేళ్ల క్రితమే దేవిశ్రీ ప్రసాద్ హీరో గా ఎంట్రీ ఇవ్వడానికి కొన్ని ప్రయత్నాలు చేసాడు. కానీ అవి కార్యరూపం దాల్చకపోవడంతో మ్యూజిక్ డైరెక్టర్ గానే తన కెరీర్ ని కొనసాగించాడు. కానీ దిల్ రాజు కి ఈ కథతో దేవిశ్రీ ప్రసాద్ ని హీరో గా పరిచయం చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన రావడం, వెంటనే వేణు ని దేవి శ్రీ వద్దకు తీసుకెళ్లి ఈ సినిమా స్టోరీ ని వినిపించడం, ఆయనకు తెగ నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వంటివి జరిగిందట. రెమ్యూనరేషన్ కూడా 5 కోట్ల రూపాయలకు పైగానే దిల్ రాజు ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం దేవి శ్రీ ప్రసాద్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దేవి శ్రీ ప్రసాద్ చేతిలో మ్యూజిక్ డైరెక్టర్ గా పెద్దగా సినిమాలేవీ లేవు. ఈ గ్యాప్ లో ఆయన హీరో గా మూవీ చేసే అవకాశం వచ్చింది. తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే ఈ ఎల్లమ్మ చిత్రం లో హీరో పాత్రకు ఎంతటి ప్రాధాన్యత ఉందో, హీరోయిన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుందట. కీర్తి సురేష్ హీరోయిన్ గా ఖరారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టాక్. మ్యూజిక్ డైరెక్టర్ గా గత రెండున్నర దశాబ్దాల నుండి నెంబర్ 1 స్థానం లో కొనసాగుతూ, సౌత్ ఇండియా ని షేక్ చేసిన దేవిశ్రీ ప్రసాద్, నటుడిగా ఏ మేరకు సక్సెస్ సాదిస్తాడో చూడాలి.