Bigg Boss 9 Telugu Ayesha: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లోకి ఫైర్ స్ట్రోమ్ అంటూ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన వారిలో ఒకరు అయేషా. ఈమె గతం లో స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘ఊర్వశివో..రాక్షసివో’ సీరియల్ లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఈమె ‘కిరాక్ బాయ్స్..కిలాడీ లేడీస్’ అనే గేమ్ షోలో కూడా పాల్గొన్నది. ఈ రెండు సీరియల్స్ కి ముందు ఆమె తమిళం లో రెండు సూపర్ హిట్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించింది. అక్కడి బిగ్ బాస్ ఆరవ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి దాదాపుగా 70 రోజులు హౌస్ లో కొనసాగింది. అలాంటి ఆమె ఈ సీజన్ లో వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతుంది అనగానే, ఆడియన్స్ లో కొంత అంచనాలు ఏర్పడ్డాయి. హౌస్ లోకి అడుగుపెట్టిన రోజే ఈమె చలాకీ తనం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఇక ఈమె తనకు మొదటి వారం అయినప్పటికీ కూడా తనూజ ని నామినేట్ చేసి, సరైన పాయింట్స్ చెప్తూ హౌస్ ని షేక్ చేసింది. ఇద్దరు అందమైన అమ్మాయిల మధ్య క్లాష్ ఇలాగే కొనసాగితే వేరే లెవెల్ లో ఉంటుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కూడా కామెంట్స్ చేశారు. అయితే గడిచిన మూడు రోజుల్లో అయేషా ప్రవర్తన కొంతమందికి నచ్చింది, మరికొంతమందికి నచ్చలేదు. కొన్ని సందర్భాల్లో ఈమె చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు అనిపించింది. భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో చూడాలి. ఇదంతా పక్కన పెడితే అయేషా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆయేషా కి ఒకసారి కాదు, రెండుసార్లు నిశ్చితార్థం జరిగింది. కానీ పెళ్లి చేసుకోలేదు. మొదటిసారి ఆమె హారన్ రెడ్డి అనే వ్యక్తిని ప్రేమించింది.
ఆయన ఒక పెద్ద ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్. వీళ్లిద్దరు కలిసి తమిళం లో మూడు సినిమాలకు కలిసి పనిచేశారు. అలా అతనితో గాఢమైన ప్రేమలో ఉన్న సమయం లో, అతను మరో అమ్మాయితో కూడా రిలేషన్ మైంటైన్ చేస్తున్నాడు అనే విషయం తెలుసుకొని అతనికి బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత 2023 వ సంవత్సరం లో యోగి అనే వ్యక్తితో కూడా ఈమె ప్రేమాయణం నడిపింది. డేటింగ్ లో ఉన్నట్టు ప్రకటించి, అతనితో నిశ్చితార్థం కూడా చేసుకుంది, కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ, ఈ రిలేషన్ కూడా నిలబడలేదు. ఇదంతా పక్కన పెడితే ఈమె తమిళ బిగ్ బాస్ షో లో ఉన్నప్పుడు దేవ్ అనే వ్యక్తి ఆయేషా తనను ప్రేమించానని చెప్పి మోసం చేసిందని, పెళ్లి చేసుకుందామని ఆమె ఇంటికి వెళ్తే, తనను అవమానించడమే కాకుండా, ఆమె మనుషులతో కొట్టించి పంపించింది మీడియా ముందుకు వచ్చి అప్పట్లో ఆరోపణలు చేసాడు. ఇలా ఈ హాట్ బ్యూటీ పై చాలా వివాదాలే ఉన్నాయి.