Pawan Kalyan And Prabhas: ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా టిక్కెట్ల కోసం కొట్టుకునేవారు. ఆయన మూవీని మొదటి రోజు చూసే అదృష్టం అందరికీ దక్కేది కాదు…ఆ మూవీ టిక్కెట్స్ కోసం నిలబడ్డ అభిమానులు కొన్ని లక్షల్లో ఉండేవారు. ఇప్పుడు ఆయన కోసం పడి చచ్చిపోయేవారు కోట్లలో ఉన్నారు. ఆయన ప్రస్తుతం రాజకీయ రంగంలో రాణిస్తూనే సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు… నిజానికి ఇండస్ట్రీ లో సక్సెస్ ఫుల్ సినిమాలను చేసిన హీరోలకి మాత్రమే ఎక్కువ క్రేజ్ దక్కుతోంది. కానీ ప్లాప్ సినిమాలతో కూడా తన క్రేజ్ ను పెంచుకున్న ఏకైక హీరో పవన్ కళ్యాణ్… ఇక రీసెంట్ గా ఈయన ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించింది. పవన్ కళ్యాణ్ కత్తి పట్టుకుని స్క్రీన్ మీద కనిపిస్తే అభిమానులకు కన్నుల పండుగగా మారింది. మొత్తానికైతే గత కొన్ని సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు సక్సెస్ లను సాధించలేకపోయాయి. కానీ ఓజీ సినిమా మాత్రం సుజీత్ మేకింగ్, పవన్ కళ్యాణ్ స్వాగ్ మొత్తానికైతే ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అయ్యేలా చేశాయి… ఇక పవన్ కళ్యాణ్ కెరియర్ స్టార్టింగ్ లో వరుస సక్సెస్ లను సాధించాడు. ఖుషి సినిమా తర్వాత ఆయన చేసిన జానీ సినిమా డిజాస్టర్ అయినప్పటికి ఆ సినిమా మేకింగ్ గాని, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ గాని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని చాలామంది అభిమానులు చెబుతుంటారు.
ఇప్పటికి ఆ సినిమా చాలా మంది కి ఫేవరెట్ గా మారిపోయింది అంటే దానికి పవన్ కళ్యాణ్ డైరెక్షన్ కారణమనే చెప్పాలి… ఇక ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ సైతం ఒకప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు…
కెరియర్ మొదట్లో లవ్ స్టోరీస్, కమర్షియల్ యాక్షన్ సినిమాలను ఎక్కువగా ఎంచుకున్న ప్రభాస్ ఆ తర్వాత మాస్ లో తన ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చాడు. వర్షం సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా ఒక సినిమా స్టార్ట్ అవ్వాల్సింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది కారణం ఏంటి అంటే ఆ మూవీ కథ తను అనుకున్న రేంజ్ లో కుదరడం లేదట.
దాంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాను ఆపేశారు అంటూ అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి. నిజానికి ప్రభాస్ కి సైతం జానీ సినిమా అంటే చాలా ఇష్టమట. అందుకే ఆయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఒకవేళ ఆ సినిమా వస్తే మాత్రం ఆ మూవీ కి ఉన్న క్రేజ్ మరే సినిమాకి ఉండేది కాదు…