Devi Sri Prasad Hero Movie: సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో దేవి శ్రీ ప్రసాద్(Devisri Prasad) పేరు కచ్చితంగా ఉంటుంది. ‘దేవి’ సినిమాతో ఆయన కెరీర్ మొదలైంది. అప్పటి నుండి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సాంగ్స్ కి సంగీతం అందించి, ఎవర్ గ్రీన్ లెజెండ్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ కూడా ఆయన చెక్కు చెదరని డిమాండ్ తో కొనసాగుతూ ముందుకు పోవడం గమనార్హం. అయితే ఒక పక్క మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తూనే మరో పక్క హీరో గా కూడా కొనసాగాలని చూస్తున్నాడు దేవి శ్రీ ప్రసాద్. ఆయన హీరో గా ప్రస్తుతం తెరకెక్కుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’. దిల్ రాజు నిర్మాణంలో, ‘బలగం’ వేణు దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
అయితే దేవిశ్రీ ప్రసాద్ హీరో గా ఎంట్రీ ఇవ్వాలని అనుకోవడం ఇప్పటి ప్రయత్నం కాదు. 15 ఏళ్ళ క్రితమే ఆయన హీరో గా ఎంట్రీ ఇవ్వాల్సింది. డైరెక్టర్ మరెవరో కాదు సుకుమార్. ఇండస్ట్రీ లో దేవిశ్రీ ప్రసాద్ కి అత్యంత ఆప్తులలో ఒకరు సుకుమార్. ఆయన మొదటి సినిమా ఆర్య నుండి, మొన్న విడుదలైన ‘పుష్ప 2’ వరకు ప్రతీ సినిమాకు ఆయనే సంగీతం అందించాడు. వీళ్ళ కలయిక లో వచ్చిన సినిమాలు హిట్/ ఫ్లాప్ అనేది పక్కన పెడితే, ఆడియో పరంగా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యేది. సుకుమార్ భవిష్యత్తులో చేయబోయే సినిమాలకు కూడా దేవి శ్రీ ప్రసాద్ యే సంగీతం అందిస్తాడు. వృత్తిపరంగా, వ్యక్తిగతం గా వీళ్లిద్దరి మధ్య అంతటి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యం తోనే దేవి శ్రీ ప్రసాద్ ని హీరో గా పెట్టి తన దర్శకత్వం లో ఒక భారీ సినిమా అప్పట్లో ప్లాన్ చేసాడట సుకుమార్.
కానీ దేవి శ్రీ ప్రసాద్ తండ్రి చనిపోవడం తో చాలా డిప్రెషన్ లోకి వెళ్లడం వల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేకపోయింది అట. ఆ తర్వాత సుకుమార్ తన కమిట్మెంట్స్ తో ఫుల్ బిజీ అయిపోవడం వల్ల వీళ్ళ కాంబినేషన్ లో సినిమా కుదర్లేదట. ఈ విషయాన్నీ స్వయంగా దేవి శ్రీ ప్రసాద్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఒకవేళ సుకుమార్ దర్శకత్వం లో దేవి శ్రీ ప్రసాద్ లాంచ్ అయ్యి భారీ హిట్ కొట్టి ఉండుంటే ఈరోజు హీరో గా దేవి శ్రీ ప్రసాద్ కెరీర్ వేరే రేంజ్ లో ఉండేదట. చూడాలి మరి భవిష్యత్తులో అయిన వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఉంటుందో లేదో అనేది .ఇకపోతే ప్రస్తుతం ఆయన హీరో గా నటిస్తున్న ‘ఎల్లమ్మ’ చిత్రానికి నెలలో పది రోజుల కాల్ షీట్స్ కేటాయిస్తున్నాడట.