Homeఎంటర్టైన్మెంట్Jai Hanuman Movie Updates: 'జై హనుమాన్' చిత్రం లో శ్రీ రాముడి పాత్ర చేయబోతున్న...

Jai Hanuman Movie Updates: ‘జై హనుమాన్’ చిత్రం లో శ్రీ రాముడి పాత్ర చేయబోతున్న సూపర్ స్టార్..ఫ్యాన్స్ కి విజువల్ ఫీస్ట్ !

Jai Hanuman Movie Updates: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ప్రస్థానాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘హనుమాన్'(Hanuman Movie). చిన్న సినిమాగా విడుదలైన ఈ చిత్రం , ఎన్నో రాజకీయాలకు తల ఒగ్గాల్సి వచ్చింది. అతి తక్కువ థియేటర్స్ లో విడుదలైనప్పటికీ, ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమాకు సీక్వెల్ గా ‘జై హనుమాన్'(Jai Hanuman movie) తెరకెక్కుతోందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొదటి భాగం క్లైమాక్స్ లోనే తెలిపాడు. అయితే ఇన్ని స్క్రిప్ట్ వర్క్ పనుల్లో ఫుల్ బిజీ గా ప్రశాంత్ వర్మ, ఎట్టకేలకు స్క్రిప్ట్ ని పూర్తి చేసి, రీసెంట్ గానే ఈ చిత్రం లో హనుమాన్ పాత్ర పోషించడానికి ఒప్పుకున్న రిషబ్ శెట్టి ని కలిసి ఫైనల్ న్యారేషన్ ఇచ్చాడట.

ఆయన కథ తెగ నచ్చేసింది. ఈ నెల 22 న హంపీ లో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అనంతరం ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది అట. మొదటి భాగం లో హీరో గా నటించిన తేజ సజ్జ కూడా ఇందులో కనిపిస్తాడట. ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉంటుందట కానీ, కథని కీలక మలుపు తిప్పే విధంగా ఆ పాత్ర ఉంటుందట. ఇక పోతే ఈ చిత్రం లో రానా దగ్గుబాటి ఒక కీలక పాత్ర పోషించబోతున్న సంగతి తెలిసిందే. చాలా మంది ఈయన ఈ చిత్రం లో శ్రీ రాముడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని ప్రచారం చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదట. ఇందులో ఈయన విలన్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు అట. శ్రీ రాముడి పాత్రలో బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ కనిపిస్తాడని టాక్. ప్రస్తుతం రణబీర్ కపూర్ ‘రామాయణం’ లో శ్రీ రాముడి క్యారెక్టర్ చేస్తున్నాడు.

మరోసారి ఈ చిత్రం లో ఆయన శ్రీరాముడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. రణబీర్ కపూర్ ఈ చిత్రం లో నటించడం వల్ల బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతుందని, కచ్చితంగా అక్కడ మంచి ఓపెనింగ్స్ ని రాబడుతుందని అంటున్నారు విశ్లేషకులు. త్వరలోనే ఆయన ఈ చిత్రం లో నటించబోతున్నాడా లేదా అనే విషయం పై క్లారిటీ రాబోతుంది అట. ఇక పోతే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ని ముందుగా ఏప్రిల్ నెలలో రానా దగ్గుబాటి తో ప్రారంబిస్తారట. ఆ తర్వాత కొన్ని రోజులకు రిషబ్ శెట్టి షూటింగ్ లో జాయిన్ అవుతాడని తెలుస్తోంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version