Vishwak Sen: చేసిన సినిమాల్లో అత్యధిక శాతం సక్సెస్ లు ఉన్న హీరో విశ్వక్ సేన్(Vishwak Sen). ‘ఈనగరానికి ఏమైంది’ నుండి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వరకు ఆయన చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్, లేదా యావరేజ్ రేంజ్ లో ఆడాయి. కానీ ‘మెకానిక్ రాకీ’ చిత్రం నుండి విశ్వక్ సేన్ జాతకం మారిపోయింది. ఈ సినిమా నుండి ఆయన చేసిన రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. అందులో ఒకటి ‘లైలా’, ఇంకోటి రీసెంట్ గా విడుదలైన ‘ఫంకీ’. ఈ రెండు చిత్రాలు విశ్వక్ సేన్ మార్కెట్ ని పూర్తిగా దెబ్బ తీశాయి. ముఖ్యంగా లైలా చిత్రం గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఏనాడూ కూడా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పని విశ్వక్ సేన్, ఈ సినిమా చేసినందుకు క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఆ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యింది అనేది.
ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఫంకీ’ చిత్రం తో అయినా భారీ కం బ్యాక్ ఇస్తాడనుకుంటే, ఈ సినిమా కూడా పెద్ద ఫ్లాప్ అయ్యింది. గమ్మత్తు ఏమిటంటే ఈ రెండు చిత్రాలు కూడా వాలెంటైన్స్ డే కానుకగా విడుదలయ్యాయి. ‘లైలా’ చిత్రం గత ఏడాది ఫిబ్రవరి 14 న విడుదల అవ్వగా, ‘ఫంకీ’ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 13న విడుదలైంది. ఈ రెండు కూడా ప్రేమికుల దినోత్సవం రోజున అట్టర్ ఫ్లాప్ అయ్యిందంటే, ఇది కచ్చితంగా బ్యాడ్ సెంటిమెంట్ అనే అనుకోవాలి. కొంతమంది నెటిజన్స్ అయితే, ఏ అమ్మాయిని అయినా ప్రేమలో పడేసి మోసం చేసినావా ఏందీ?, ఆమె శాపం వల్లే వాలెంటైన్స్ డే రోజున విడుదలయ్యే నీ ప్రతీ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ విశ్వక్ సేన్ ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని కనిపెడితే మాత్రం ఈసారి నుండి వాలెంటైన్స్ డే నాడు సినిమాలను విడుదల చేయడం ఆపేస్తాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే రేపు విశ్వక్ సేన్ హీరో గా నటించిన కొత్త చిత్రం ‘కల్ట్’ కి సంబంధించిన టీజర్ విడుదల కాబోతుంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం విశ్వక్ సేన్ చేస్తున్నాడు. డైలాగ్స్ రైటింగ్ మాత్రం తరుణ్ భాస్కర్ రాశాడట. విశ్వక్ సేన్ గతం లో ‘ఫలక్ నూమా దాస్’, ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రెండు కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని, కచ్చితంగా డైరెక్టర్ గా విశ్వక్ సేన్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టబోతున్నాడని ఆయన అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.