Devara: దేవర బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అన్ని వందల కోట్లు సాధించాల్సిందేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఇక కొరటాల శివ కూడా ఒకప్పుడు మంచి సినిమాలను చేస్తూ టాప్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ప్రస్తుతం ఆయన ఫ్లాపుల్లో ఉన్నాడు...

Written By: Vicky, Updated On : September 17, 2024 1:50 pm

Devara(3)

Follow us on

Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తనదైన రీతిలో జూనియర్ ఎన్టీఆర్ కి భారీ గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఆయన సోలోగా పాన్ ఇండియాలో చేస్తున్న సినిమా దేవర అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నప్పటికీ కొంతమంది నెగిటివ్ ప్రచారం చేస్తున్నందువల్ల ఈ సినిమా మీద రోజు రోజుకి అంతనాలైతే తగ్గుతున్నాయనే చెప్పాలి. మరి ఎందుకు ఇలా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనే విషయం పక్కన పెడితే దేవర సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మాత్రం దాదాపు 300 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టాల్సిన అవసరమైతే ఉంది.

ఇక ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. కాబట్టి 300 కోట్లకు పైన కలెక్షన్స్ వస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ గా నిలుస్తుంది. లేకపోతే మాత్రం ఈ సినిమా సక్సెస్ ని సాధించడం కూడా కష్టమవుతుందనే చెప్పాలి. ఇక అంతా కంటే తక్కువ కలెక్షన్స్ వస్తే మాత్రమే ప్రొడ్యూసర్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్లు అందరికీ కూడా భారీ నష్టాలను మిగులుస్తుంది. కాబట్టి ఎలాగైనా సరే 300 కోట్ల పైన టార్గెట్ ని సాధించాలి అంటే మాత్రం ఈ సినిమాలో ఏదో ఒక ఎలిమెంట్ అయితే అద్భుతంగా ఉండాలి. ఇక ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న విషయం మనకు తెలిసిందే…

ఇక ఇప్పటికే ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటూ దర్శకుడు కొరటాల శివ చెప్తూ వస్తున్నాడు. మరి తను చెప్పిన దాంట్లో నిజం ఎంతవరకు ఉంది అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఇదిలా ఉంటే దేవర సినిమాతో మొదటిసారి తెలుగు సినిమా చేస్తున్న జాన్వీ కపూర్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఈ సినిమాతో జాన్వీ కపూర్ భారీ సక్సెస్ ని అందుకుంటే పాన్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుంటుంది.

లేకపోతే మాత్రం ఆమె కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగడం కష్టమవుతుందనే చెప్పాలి. ఈ ఒక్క సినిమాతో ముగ్గురి భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. ఇటు కొరటాల శివ కూడా ఆచార్య తో ప్లాప్ ను మూట గట్టుకున్నాడు. కాబట్టి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటేనే ఆయన స్టార్ డైరెక్టర్ గుర్తింపు సంపాదించుకుంటాడు. లేకపోతే కష్టం అవుతుందనే చెప్పాలి. ఇక కొరటాల, ఎన్టీయార్, జాన్వీ కపూర్ ఈ ముగ్గురి పాన్ ఇండియా కెరియర్ అనేది ఈ సినిమా మీదనే ఆధారపడి ఉంది…