Devara Collections : స్టార్ హీరోల సినిమాలకు ఇటీవల కాలం లో లాంగ్ రన్ ని చూసి చాలా కాలం అయ్యింది. కానీ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రానికి ఎవ్వరూ ఊహించని లాంగ్ రన్ వస్తుంది. విడుదలై నిన్నటితో 20 రోజులు పూర్తి అయ్యింది. #RRR చిత్రానికి కూడా వరుసగా 17 రోజులు మాత్రమే కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి, కానీ దేవర కి ఏకంగా 19 రోజులు నాన్ స్టాప్ గా కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. 20 వ రోజు ఈ చిత్రానికి జీఎస్టీ తో కలిపి 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, మొత్తం మీద 20 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ఎంత వసూళ్లు వచ్చాయో ఇప్పుడు ఒకసారి చూద్దాము. కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి ఇప్పటి వరకు 130 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 20 రోజులకు 44 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.
రిటర్న్ జీఎస్టీ తో కలిపి చూస్తే 50 కోట్ల రూపాయలకు చేరుకుందని టాక్. అలాగే సీడెడ్ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం లో 15 కోట్ల రూపాయిలు, తూర్పు గోదావరి జిల్లాలో 8 కోట్ల రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 కోట్ల రూపాయిలు, గుంటూరు జిల్లాలో 12 కోట్ల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాగే నెల్లూరు జిల్లాలో 20 రోజులకు గానూ ఈ చిత్రానికి 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
మొత్తం మీద 130 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను తెలుగు రాష్ట్రాల నుండి రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక ప్రాంతం నుండి 17 కోట్ల రూపాయిలు, తమిళనాడు నుండి 4 కోట్ల రూపాయిలు, కేరళ నుండి 50 లక్షలు, హిందీ వెర్షన్ కి కలిపి 33 కోట్లు, ఓవర్సీస్ లో 36 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొత్తం మీద ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 220 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, 410 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాగే 20 వ రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన టాప్ 6 సినిమాలలో ఒకటిగా నిల్చింది దేవర. మొదటి స్థానంలో బాహుబలి 2 చిత్రం ఉండగా, రెండవ స్థానం లో పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రం ఉంది. ఆ తర్వాత బాహుబలి చిత్రం ఉండగా, కల్కికి చిత్రం నాల్గవ స్థానం లో నిచ్చింది. ఇక ఈ ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని కొల్లగొట్టిన హనుమాన్ చిత్రం టాప్ 5 స్థానం లో నిలబడగా, దేవర చిత్రం 6 వ స్థానంలో నిల్చింది.