Multistarrer movie : టాలీవుడ్ మల్టీస్టార్రర్ సినిమాల ట్రెండ్ ఒక రేంజ్ లో ఊపు అందుకున్నది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నుండి అని చెప్పొచ్చు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కాలం లో మల్టీస్టార్రర్ చిత్రాలకు కొదవే లేదు. ఏడాదికి ఒకటి వస్తుండేవి, కానీ చిరంజీవి యుగం మొదలయ్యాక మల్టీస్టార్రర్ చిత్రాల జోరు బాగా తగ్గింది. చిన్న హీరోలు, మీడియం రేంజ్ హీరోలు కలిసి మల్టీస్టార్రర్ చిత్రాలు చేసేవాళ్ళు కానీ, అవి మన టాలీవుడ్ మార్కెట్ ని పెంచేందుకు ఏమాత్రం ఉపయోగపడలేదు. అయితే ఈ కాలం లో మల్టీస్టార్రర్ చిత్రాల ట్రెండ్ చాలా సాధారణం అయిపోయింది కాబట్టి, కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్, వెంకటేష్, నాగార్జున కాంబినేషన్ లో ఒక భారీ మల్టీస్టార్రర్ చిత్రం మిస్ అయ్యిందట. ఆ సినిమా మరేదో కాదు, రామ్ చరణ్ కృష్ణ వంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గోవిందుడు అందరివాడేలే’ అనే చిత్రం. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని దక్కించుకుంది.
ఇందులో ముందుగా శ్రీకాంత్ పాత్రకు విక్టరీ వెంకటేష్ ని, రామ్ చరణ్ కి తండ్రి పాత్ర కోసం అక్కినేని నాగార్జున ని తీసుకుందామని అనుకున్నారట. అలాగే సినిమాకి ఎంతో కీలకంగా నిల్చిన ప్రకాష్ రాజ్ క్యారక్టర్ కి సూపర్ స్టార్ కృష్ణ ని తీసుకుందాం అని అనుకున్నారు. అలా భారీ మల్టీస్టార్రర్ గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నాడు కృష్ణ వంశీ. కానీ కథ సిద్ధం అయ్యాక అంత పెద్ద స్టార్స్ ఉండగలిగేంత బలమైన పాత్రలుగా కృష్ణ వంశీ కి అనిపించలేదట. ఈ చిత్రం లో శ్రీకాంత్ జులాయి గా తిరిగే ఒక తాగుబోతు క్యారక్టర్ చేసాడు. ఇలాంటి క్యారక్టర్ లో వెంకటేష్ లాంటి స్టార్ ఊహించగలమా?, అందుకే కృష్ణ వంశీ మీ స్థాయికి తగ్గ పాత్ర కాదు సార్ అని చెప్పి, ఆ పాత్ర నుండి వెంకటేష్ ని తప్పించి శ్రీకాంత్ ని తీసుకున్నారు. ఇక రామ్ చరణ్ తండ్రి క్యారక్టర్ కి కూడా బలమైన ప్రాధాన్యత లేదు, అందుకే నాగార్జున ని కూడా సంప్రదించలేదు.
కానీ ప్రకాష్ రాజ్ క్యారక్టర్ ని మాత్రం ముందుగా సూపర్ స్టార్ కృష్ణ తో వేయించాలని బలంగా నిర్ణయించుకున్నాడట డైరెక్టర్ కృష్ణ వంశీ. కానీ ఆ పాత్ర చాలా పవర్ ఫుల్ అవ్వడం, అంతటి నిడివి ఉన్న పాత్రలను పోషించే స్థాయిలో కృష్ణ గారి ఆరోగ్యం లేకపోవడం వల్ల ఆ క్యారక్టర్ ని ప్రకాష్ రాజ్ చేసాడు. హీరో క్యారక్టర్ తో సరిసమానంగా ఈ పాత్ర ఉంటుంది. కథ మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతుంది. అప్పట్లోనే 50 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం, ఫుల్ రన్ లో 43 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. బాక్స్ ఆఫీస్ ఫలితం ఎబోవ్ యావరేజ్ గా పరిగణించొచ్చు.