https://oktelugu.com/

Director Sukumar : నేను ఆరోజు అల్లు అర్జున్ పేరు చెప్తే అందరూ పగలబడి నవ్వారు : సుకుమార్

ఆర్య సినిమా కథ చెప్పగానే ఆయనకీ బాగా నచ్చింది. ఈ సినిమాని స్టార్ హీరోలు, యంగ్ హీరోలు కాకుండా, కొత్త వాళ్ళతో చేయాలనీ అనుకున్నాం. అప్పుడే ఇండస్ట్రీ లోకి అల్లు అర్జున్ కొత్తగా వచ్చాడు. ఈ అబ్బాయిని తీసుకుంటే ఎలా ఉంటుంది అని మా టీం ని అడిగాను. వాళ్ళు పగలబడి నవ్వారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 17, 2024 / 08:58 PM IST

    Allu Arjun-Sukumar combination

    Follow us on

    Director Sukumar :  టాలీవుడ్ లో మంచి సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ లో ఒకటి అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయిక ఆర్య సినిమాతో మొదలైంది. సుకుమార్ మొదటి సినిమాగా, అల్లు అర్జున్ రెండవ సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో ఒక కాసుల కనకవర్షం కురిపించింది. ఇక ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘ఆర్య 2 ‘ చిత్రం వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ గా అనుకున్నంత రేంజ్ లో ఆడలేదు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని వీళ్లిద్దరు పుష్ప చిత్రాన్ని చేసారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పాన్ ఇండియా లెవెల్ లో ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ ‘పుష్ప 2 : ది రూల్’ అనే చిత్రం తెరకెక్కుతుంది.

    మొదటి భాగం పెద్ద సూపర్ హిట్ అవ్వడంతో, ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అంచనాలు మామూలు రేంజ్ లో ఏర్పడలేదు. అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తర్వాత చూద్దాం, కానీ గతం లో సుకుమార్ అల్లు అర్జున్ ఆర్య సినిమా గురించి మాట్లాడిన కొన్ని మాటలు, ఇప్పుడు సోషల్ మీడియా లో అల్లు అర్జున్ అభిమానులు మరోసారి షేర్ చేస్తూ వైరల్ చేసారు.

    సుకుమార్ మాట్లాడుతూ ‘దిల్ రాజు గారు అప్పట్లో దిల్ సినిమా షూటింగ్ సమయం లో ఈ సినిమా హిట్ అయితే నీకు దర్శకత్వం వహించే అవకాశం ఇస్తా అని చెప్పాడు. అతను చెప్పినట్టిగనే దిల్ సినిమా పెద్ద హిట్ అయ్యింది. రాజు గారు నాతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాతో ఒక రీమేక్ తీయమని చెప్పాడు, కానీ నేను రీమేక్ సినిమాలు చేయనని దిల్ రాజు ముఖం మీదనే చెప్పేసాను. సరే నీ దగ్గర ఏదైనా కథ ఉంటే చెప్పు అన్నాడు. ఆర్య సినిమా కథ చెప్పగానే ఆయనకీ బాగా నచ్చింది. ఈ సినిమాని స్టార్ హీరోలు, యంగ్ హీరోలు కాకుండా, కొత్త వాళ్ళతో చేయాలనీ అనుకున్నాం. అప్పుడే ఇండస్ట్రీ లోకి అల్లు అర్జున్ కొత్తగా వచ్చాడు. ఈ అబ్బాయిని తీసుకుంటే ఎలా ఉంటుంది అని మా టీం ని అడిగాను. వాళ్ళు పగలబడి నవ్వారు. ఎందుకంటే అల్లు అర్జున్ చాలా చిన్నపిల్లవాడు, గంగోత్రి సినిమాని చూసిన కళ్ళతో అల్లు అర్జున్ ని ఆర్య క్యారక్టర్ లో ఊహించుకోలేకపోయారు. కానీ అల్లు అర్జున్ ని నేను ఒకరోజు కలిసినప్పుడు అతని మాట తీరు, ప్రవర్తన అన్ని గమనించాను. నా ఆర్య క్యారక్టర్ కి దగ్గరగా ఉంది, నాకు హీరో దొరికేసాడు అని దిల్ రాజుతో చెప్పి అల్లు అర్జున్ తో ఈ సినిమా చేసాము’ అంటూ చెప్పుకొచ్చాడు సుకుమార్.