Devara : గత ఏడాది ఎన్టీఆర్(Junior NTR) నటించిన ‘దేవర'(Devara Movie) చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోజింగ్ వరకు రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టి దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆరంభం లో వచ్చిన డివైడ్ టాక్ కి , లాంగ్ రన్ లో వచ్చిన వసూళ్లకు అసలు ఏమాత్రం సంబంధం లేదు. ఎన్టీఆర్ స్టార్ స్టేటస్ కి కొలమానం గా నిల్చింది ఈ చిత్రం. ఈ సినిమాని రీసెంట్ గానే జపాన్ భాషలో డబ్ చేసి గ్రాండ్ గా విడుదల చేసారు. స్వయంగా ఎన్టీఆర్ జపాన్ కి వెళ్లి ఈ సినిమా ప్రొమోషన్స్ లో చురుగ్గా పాల్గొనడం, అక్కడి అభిమానులతో ఇంటరాక్ట్ అవ్వడం, స్పెషల్ ప్రీమియర్ షోలో డ్యాన్స్ వేయడం వంటివి చెసాడు. అంతే కాకుండా అక్కడి మీడియా చానెల్స్ కి ఎన్టీఆర్ ప్రత్యేకమైన ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు.
Also Read : జపాన్ లో ‘దేవర’ సునామీ..3 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయంటే!
ఇదంతా చూసిన తర్వాత కచ్చితంగా ఈ చిత్రానికి జపాన్ లో భారీ ఓపెనింగ్స్ వస్తాయని ఆశించారు., కానీ భారీ ఓపెనింగ్స్ రాకపోయినా, ఒక మోస్తరు ఓపెనింగ్స్ వచ్చింది అనే చెప్పాలి. రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రానికి కేవలం వీకెండ్ లో 20 మిలియన్ జపనీస్ డాలర్స్ రాగా, దేవర చిత్రానికి మొదటి వారం మొత్తం కలిపి కూడా 15 మిలియన్ డాలర్లు రాకపోవడం గమనార్హం. వారం రోజుల బ్రేకప్ ఒక్కసారి పరిశీలిస్తే మొదటి వీకెండ్ లో ఈ చిత్రానికి దాదాపుగా 3000 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. మరోపక్క రంగస్థలం చిత్రానికి కేవలం మొదటి రోజు 2500 టిక్కెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. ఆరు రోజులు పూర్తి అయ్యేసరికి ‘దేవర’ చిత్రానికి 9500 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. ఓవరాల్ గా మొదటి వారం ఈ చిత్రానికి పది వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు.
10 వేల టికెట్స్ కి గాను 15 మిలియన్ల జపనీస్ డాలర్స్ వచ్చాయని. ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూసుకుంటే కేవలం 91 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే అని అంటున్నారు. ఇక్కడి నుండి జపాన్ కి వెళ్లడం, అక్కడ ప్రొమోషన్స్ కోసం తిరగడం వంటివి చాలా శ్రమతో కూడుకున్నవి. అన్ని సినిమాలు కచ్చితంగా జపాన్ లో క్లిక్ అవుతాయి అనే నమ్మకం లేదు. ప్రొమోషన్స్ కోసమే దేవర టీం రెండు కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేసి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కేవలం 91 లక్షలు మాత్రమే వచ్చాయి. అక్కడి థియేటర్స్ రెంట్స్ మరియు ఇతర టాస్కులు కలిపి నిర్మాతలకు కనీసం 30 లక్షల రూపాయిలు కూడా చేతికి వచ్చి ఉండవు. కాబట్టి ఇక నుండి మన స్టార్ హీరోలు జపాన్ కి వెళ్లి ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు విశ్లేషకులు.
Also Read : దేవర 2 లో ట్విస్ట్ ఏంటో చెప్పేసిన ఎన్టీయార్…