https://oktelugu.com/

Aishwarya Rai  : ఐశ్వర్యరాయ్ బాడీ గార్డ్ నెల జీతంతో ఒక కంపెనీ ని కొనేయొచ్చు తెలుసా!

Aishwarya Rai  : అభిషేక్ బచ్చన్ ని పెళ్లాడిన తర్వాత సినిమాలకు కొంతకాలం వరకు బ్రేక్ ఇచ్చిన ఐశ్వర్య రాయ్, ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ తర్వాత ఆమె సినిమాలను చాలా ఆచి తూచి ఎంచుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే ఐశ్వర్య రాయ్ ఒక్కో సినిమాకు 12 నుండి 20 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటుందని సమాచారం.

Written By: , Updated On : March 31, 2025 / 09:19 PM IST
Aishwarya Rai's bodyguard monthly salary

Aishwarya Rai's bodyguard monthly salary

Follow us on

Aishwarya Rai  : విశ్వ సుందరి గా మోడలింగ్ రంగం లో రాణించి, ఆ తర్వాత హీరోయిన్ గా వెండితెర అరంగేట్రం చేసి, ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాయ్(Aishwarya Rai Bachan). మణిరత్నం(Maniratnam) దర్శకత్వం లో తెరకెక్కిన ఇద్దరు అనే చిత్రం ద్వారా ఐశ్వర్య రాయ్ మొదటిసారి కెమెరా ని ఎదురుకుంది. ఈ చిత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఆమెకు అవకాశాలు క్యూలు కట్టాయి. కానీ ఆమె మన సౌత్ ఇండియన్ సినిమాలకంటే ఎక్కువగా నార్త్ ఇండియన్ సినిమాల మీదనే ద్రుష్టి పెట్టింది. ఫలితంగా అక్కడే ఆమె సూపర్ స్టార్ గా మారిపోయింది. మధ్యలో జీన్స్, ప్రియురాలు పిలిచింది, రోబో, పొన్నియన్ సెల్వన్ సిరీస్ వంటి దక్షిణాది సినిమాలు చేసింది కానీ, ఎక్కువ ద్రుష్టి హిందీ పైనే పెట్టింది.

Also Read : జపాన్ లో ‘దేవర’ సునామీ..3 రోజుల్లో ఎంత వసూళ్లు వచ్చాయంటే!

అభిషేక్ బచ్చన్ ని పెళ్లాడిన తర్వాత సినిమాలకు కొంతకాలం వరకు బ్రేక్ ఇచ్చిన ఐశ్వర్య రాయ్, ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీ తర్వాత ఆమె సినిమాలను చాలా ఆచి తూచి ఎంచుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే ఐశ్వర్య రాయ్ ఒక్కో సినిమాకు 12 నుండి 20 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటుందని సమాచారం. అలాంటి ఐశ్వర్య రాయ్ తన బాడీ గార్డ్ శివరాజ్ కి ఇచ్చే నెల జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు. సంవత్సరానికి అతని నెల జీతం 84 లక్షలు, అంటే నెలకు 7 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ అన్నమాట. ఈ రేంజ్ లో పేరు మోసిన MNC కంపెనీస్ లో పని చేసే టాప్ ఉద్యోగులు కూడా తీసుకోరు. సంవత్సరానికి 84 లక్షలంటే, స్వయంగా అతనే ఒక కంపెనీ పెట్టుకోవచ్చు. శివరాజ్ ని బచ్చన్ ఫ్యామిలీ కేవలం ఒక బాడీ గార్డ్ గా మాత్రమే కాదు, తమ ఇంటి కుటుంబ సభ్యుడి గా కూడా బావిస్తుంది.

2015 వ సంవత్సరం లో బాడీ గార్డ్ శివరాజ్ పెళ్లి ని స్వయంగా తన చేతుల మీదుగానే జరిపించింది ఐశ్వర్య రాయ్. అంతే కాదు తాను ఏ ఈవెంట్ కి వెళ్లినా శివరాజ్ కచ్చితంగా బందోబస్తుకు రావాల్సిందే. ఐశ్వర్య రాయ్ లాంటి అందమైన బొమ్మకు సెక్యూరిటీ గార్డ్ అంటే చాలా ఒత్తిడి ఉంటుంది మరీ. ఆమె జనాల్లోకి వచ్చినప్పుడు ఆమె మీదకు అభిమానులు పడిపోయే ప్రమాదం ఉంటుంది. అభిమానులను కంట్రోల్ చేయడం చాలా కష్టమైన చర్య. అలాంటి చర్య ను శివరాజ్ అవలీల గా చేస్తున్నాడు కాబట్టే, ఆయనకు ఆ రేంజ్ జీతం ఇస్తున్నారు. ఏది ఏమైనా ఐశ్వర్య రాయి బాడీ గార్డ్ జీతం అంశం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.