Devara: ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ విడుదలై అప్పుడే వారం రోజులు పూర్తి అయ్యింది. కొరటాల శివ దర్శకత్వం లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు ఉండేవో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ నుండి ఆరేళ్ళ తర్వాత విడుదల అవుతున్న సోలో హీరో చిత్రం, దానికి తోడు ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. టీజర్, ట్రైలర్స్ ఇలా ప్రతీ ఒక్క ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ తో పాటుగా, ఆడియన్స్ ని కూడా ఉర్రూతలూ ఊగించాయి. ఎన్టీఆర్ నటించిన మామూలు కమర్షియల్ సినిమాలే బాక్స్ ఆఫీస్ వద్ద కళ్ళు చెదిరే ఓపెనింగ్ వసూళ్లను రాబడుతుంటాయి. అలాంటిది భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం చేస్తే ఆ ఏమాత్రం ఓపెనింగ్ వసూళ్లు లేకుండా ఎందుకు ఉంటాయి. ఊహించినట్టుగానే ఈ చిత్రానికి దేశం మొత్తం మాట్లాడుకునే రేంజ్ ఓపెనింగ్ దక్కింది. కేవలం తెలుగు వెర్షన్ లోనే కాదు, హిందీ వెర్షన్ లో కూడా ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోయాయి. అలా మొదటి మొదటి రోజు 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, వారం రోజుల్లో ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
అయితే ఈ సినిమా కలెక్షన్స్ విషయం లో కాస్త కాంట్రవర్సీ ఏర్పడింది. ఎందుకంటే బయ్యర్స్ అనేక ప్రాంతాలలో వసూళ్లను రిటర్న్ జీఎస్టీ తో కలిపి చెప్తున్నారు. జీఎస్టీ ఎంత కలెక్షన్స్ లో కలిపారో క్లారిటీ ఇవ్వడం లేదు. అనేక వెబ్ సైట్స్ బయ్యర్స్ చెప్పిన వాటికి అదనంగా 18 % జీఎస్టీ ని కలిపి ఇష్టమొచ్చినట్టు కలెక్షన్స్ వేసుకుంటున్నారు. అయితే మాకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చిన నిజమైన కలెక్షన్స్ ని మీ ముందు పెట్టబోతున్నాము. ట్రేడ్ పండితులు అందించిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నైజాం ప్రాంతం నుండి 32 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే మరో 13 కోట్ల రూపాయిల షేర్ రావాల్సి ఉంది. అలాగే సీడెడ్ ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి వారం లో 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, కృష్ణ జిల్లా నుండి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు వెర్షన్ కి ప్రపంచవ్యాప్తంగా మొదటి వారం వరల్డ్ వైడ్ గా 152 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడానికి ఇంకా 28 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. ఇక హిందీ వెర్షన్ వసూళ్లను కూడా కలుపుకుంటే 172 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వాచినట్టు తెలుస్తుంది. మొత్తం మీద వరల్డ్ వైడ్ గా గ్రాస్ వసూళ్లు 320 కోట్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఇంకా అనేక ప్రాంతాలలో బ్రేక్ ఈవెన్ అవ్వాల్సి ఉంది.