https://oktelugu.com/

Devara: సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘దేవర’.. చివరి 30 నిమిషాలు మాటల్లేవ్!

అనేక సినిమాల థియేట్రికల్ ట్రైలర్స్ అభిమానులను ఆకట్టుకోలేదు. కానీ సినిమా ఫైనల్ ఔట్పుట్ అదిరిపోయాయి, 'దేవర' చిత్రం విషయం లో కూడా అదే జరగొచ్చు. ఇకపోతే ఈ సినిమాకి నేడు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసినట్టు టాక్ వినిపిస్తుంది.

Written By:
  • Vicky
  • , Updated On : September 11, 2024 / 06:07 PM IST

    Devara

    Follow us on

    Devara: టాలీవుడ్ మొత్తం ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తుంది. ఎందుకంటే ‘కల్కి’ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద సరైన హిట్ సినిమాలు లేవు. చిన్న సినిమాలు బాగానే ఆడాయి, ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు పాత సినిమాల రీ రిలీజ్ లు కాస్త థియేటర్స్ ఫీడింగ్ కి పనికొచ్చాయి. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కి మళ్ళీ మునుపతి వైభవం రావాలంటే ఒక్క భారీ హిట్ కచ్చితంగా అవసరం. అందుకే అందరూ ‘దేవర’ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి డివైడ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ అనుకున్న రేంజ్ లో లేదని, కొత్తదనం ఆశిస్తే నిరాశపర్చారని, పాత కొరటాల శివ సినిమా స్టైల్ లోనే ఉందని ఇలా రకరకాల కామెంట్స్ వినిపించాయి. అయితే కేవలం ట్రైలర్ ని చూసి సినిమా భవిష్యత్తుని చెప్పలేం.

    అనేక సినిమాల థియేట్రికల్ ట్రైలర్స్ అభిమానులను ఆకట్టుకోలేదు. కానీ సినిమా ఫైనల్ ఔట్పుట్ అదిరిపోయాయి, ‘దేవర’ చిత్రం విషయం లో కూడా అదే జరగొచ్చు. ఇకపోతే ఈ సినిమాకి నేడు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసినట్టు టాక్ వినిపిస్తుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికెట్ జారీ చేసారు. సెన్సార్ సభ్యుల నుండి వచ్చిన టాక్ చూస్తే, ఎన్టీఆర్ అభిమానులు నిన్న ట్రైలర్ ద్వారా ఏర్పడిన నెగటివిటీ ని మర్చిపోతారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమా మొత్తం కొరటాల శివ చాలా సరికొత్త టేకింగ్ తో తీసాడని, ‘వర’ క్యారక్టర్ నవ్విస్తుంది, ఏడిపిస్తుంది, అదే విధంగా గూస్ బంప్స్ కూడా రప్పించిందని మేకర్స్ ని పొగడ్తలతో ముంచి ఎత్తారట సెన్సార్ సభ్యులు. ముఖ్యంగా ఈ సినిమాలోని చివరి 40 నిమిషాలు ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే రేంజ్ లో ఉంటుందని, కచ్చితంగా అభిమానులకు అది విజువల్ ఫీస్ట్ గా ఉండబోతుందని, డైరెక్టర్ కొరటాల శివ నుండి ఈ రేంజ్ మాస్ స్టఫ్ ఊహించలేదని కితాబు ఇచ్చారట.

    ట్రైలర్ లో అందరూ ఎన్టీఆర్ తిమింగలం తో నీటి నుండి పైకి లేచే షాట్ ని చూసి వెక్కిరిస్తున్నారని, కానీ సినిమాకి ఆ సన్నివేశమే హైలైట్ గా నిలిచిందని, థియేటర్స్ లో ఈ సన్నివేశం వచ్చినప్పుడు ఆడియన్స్ ఎవ్వరూ కూడా సీట్స్ లో కూర్చోరని, కేవలం ఎన్టీఆర్ అభిమానులు మాత్రమే కాదు, ఇతర హీరోల అభిమానులు కూడా ఆ సన్నివేశాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. అంతే కాదు, పార్ట్ 2 కి కావాల్సిన లీడ్, కొరటాల శివ పెట్టిన ట్విస్ట్ ఆడియన్స్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు అభిమానులు. ఇది సినిమాకి మరో అదనపు హైలైట్ గా చెప్తున్నారు. సెన్సార్ సభ్యుల నుండి వచ్చిన ఈ టాక్ నిజమైతే దేవర చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.