https://oktelugu.com/

Goat Collections: విజయ్ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మొదటి వారం వసూళ్లు.. ఫ్లాప్ టాక్ తో భారీ లాభాలు!

తెలుగు లో ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా తమిళం మాత్రం ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా తమిళనాడు లో వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమాకి హౌస్ ఫుల్స్ పడుతున్నాయంటే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు.

Written By:
  • Vicky
  • , Updated On : September 11, 2024 / 06:03 PM IST

    Vijay

    Follow us on

    Goat Collections: తమిళ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ ఇటీవలే విడుదలై మన తెలుగు లో డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు లో టాక్ కి తగ్గట్టుగానే వసూళ్లు కూడా డిజాస్టర్ గానే ఉన్నాయి. ‘లియో’ లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ నుండి ఇలాంటి ఓపెనింగ్స్ వసూళ్లు వస్తాయని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సుమారుగా 21 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కానీ ఇప్పటి వరకు కేవలం 6 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టి, ఓవరాల్ గా బయ్యర్స్ కి 11 కోట్ల రూపాయిల నష్టాలను మిగిలించేలా ఉంది ఈ సినిమా. మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ కి ఒక భారీ ఫ్లాప్ పడింది.

    తెలుగు లో ఇంత పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా తమిళం మాత్రం ఈ చిత్రం ప్రభంజనం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా తమిళనాడు లో వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమాకి హౌస్ ఫుల్స్ పడుతున్నాయంటే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. తలపతి విజయ్ ఆఖరి సినిమా ఇదే అనే రూమర్ ఉండడం వల్లనే ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయా?, లేదా ఆడియన్స్ కి ఈ చిత్రం నిజంగా నచ్చబట్టి ఈ స్థాయి వసూళ్లు వస్తున్నాయా అనేది అంతు చిక్కడం లేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి వారం 360 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వాసూల్లు వచ్చాయట. విజయ్ తో సరిసమానం అని చెప్పుకునే ఎంతో మంది సూపర్ స్టార్స్ కి ఇప్పటి వరకు ఈ స్థాయి వసూళ్లు రాకపోవడం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ చిత్రానికి దాదాపుగా 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

    తమిళనాడు లో మొదటి వారం ఈ చిత్రానికి 140 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఫుల్ రన్ లో కచ్చితంగా 200 కోట్ల రూపాయిలు గ్రాస్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇది చిన్న మొత్తం కాదు. విజయ్ కాకుండా, రజినీకాంత్ మరియు కమల్ హాసన్ కి తప్ప మరో హీరో కి తమిళనాడు లో 200 కోట్ల రూపాయిల గ్రాస్ సినిమా లేదు. ఓవరాల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వసూళ్ల ఊపు చూస్తుంటే ఫుల్ రన్ లో కచ్చితంగా 600 కోట్ల రూపాయిల గ్రాస్ రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే కనుక జరిగితే విజయ్ చరిత్ర సృష్టించిన వాడు అవుతాడు. మరి విజయ్ తో సమానమైన క్రేజ్ ఉన్న అజిత్, ‘విడాముయార్చి’ చిత్రంతో రికార్డ్స్ ని అందుకుంటాడా లేదా అనేది చూడాలి.