Devara: దేవర క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందా..? దేవర కి బాహుబలి కి సంబంధం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ యూనిక్ స్టైల్ తో ప్రేక్షకులను కట్టిపడేసే హీరోలు మాత్రం కొంత మందే ఉన్నారు అందులో జూనియర్ ఎన్టీయార్ ఒకరు. ఇక ఇదిలా ఉంటే ఎన్టీయార్ అంటే ఇప్పుడు నందమూరి అభిమానులకు ఒక ఎమోషన్ గా మారిపోయాడు...

Written By: Gopi, Updated On : September 26, 2024 5:25 pm

Devara

Follow us on

Devara: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ తమదైన రీతిలో మంచి గుర్తింపును అందుకుంటున్న నటులు మాత్రం కొంతమందే ఉంటారు. ఇలాంటి హీరోలు ఎలాంటి క్యారెక్టర్ చేసిన కూడా వాళ్ళు అందరూ ఒదిగిపోయి నటిస్తూ ఉంటారు. ఇక ఇదే రీతిలో నందమూరి మూడోతరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ ఎవరికి అందనంత ఎత్తులో ముందుకు దూసుకెళ్ళడం లో ఎన్టీఆర్ ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఎంత పెద్ద డైలాగ్ అయిన సింగల్ టేక్ లో చెప్పగలిగే కెపాసిటీ ఉన్న నటుడు కూడా తనే కావడం విశేషం… ఇక ప్రస్తుతం ఆయన చేసిన దేవర సినిమా మరికొద్ది గంటలో రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమాలో క్లైమాక్స్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలవబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి మొత్తానికైతే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాల్సి ఉంది.

ఇక ఈ సినిమా సక్సెస్ అయితే అటు ఎన్టీఆర్ కెరియర్ అనేది చాలా సాఫీగా ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే క్లైమాక్స్ లో ఒక భారీ ట్విస్ట్ ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అది ఏంటి అంటే శ్రీకాంత్ క్యారెక్టర్ దేవర క్యారెక్టర్ ను వెన్ను పోటు పొడవబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక అక్కడి నుంచే సినిమాకి ఎండు కార్డు వేసి దానిని సెకండ్ పార్ట్ లో కంటిన్యూ చేయడానికి కూడా కొరటాల శివ స్టోరీని ఎక్స్ స్టెండ్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది…

ఇక ఈ విషయంలో కొరటాల శివ బాహుబలిని ఫాలో అవుతున్నాడా? అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక బాహుబలి లో కూడా అమరేంద్ర బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే పాయింట్ తో మొదటి పార్ట్ ను ఎండ్ చేసి ప్రేక్షకులందరికి ఒక థ్రిల్ అయితే ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో మాత్రం శ్రీకాంత్ క్యారెక్టర్ చేత దేవర క్యారెక్టర్ ని చంపేసి ఎండ్ ఇవ్వబోతున్నాడు. ఇక ఇదంతా చూస్తుంటే కొరటాల శివ సెకండ్ పార్ట్ కూడా చాలా భారీగానే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

మరి కొరటాల ఎలాగైతే ప్లాన్ చేశాడో అంతటి ఘనవిజయాన్ని ప్రేక్షకులు అందిస్తే సెకండ్ పార్ట్ కూడా సాఫీగా తెరకెక్కబోతుంది అనేది మాత్రం చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. లేకపోతే మాత్రం ఈ సినిమాకి సంబంధించిన మొదటి పార్ట్ తోనే ఈ సినిమాని ఎండ్ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఈ సినిమా సెకండ్ పార్ట్ ఉంటుందా ఫస్ట్ పార్ట్ కి ఆదరణ దక్కుతుందా? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే…