Rajamouli: ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకులు చాలామంది ఉన్నారు. ఇక ఒకప్పుడు నార్త్, సౌత్ అంటూ సినిమా ఇండస్ట్రీలో తేడాలైతే ఉండేవి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒకటే అయిపోయింది. ఇక ఇప్పటికే రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ లను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన తర్వాత తనదైన రీతిలో ముందుకు దూసుకెళుతున్న దర్శకులలో ఒక ముగ్గురు దర్శకులు మాత్రం ఇండస్ట్రీని షేక్ చేయడమే కాకుండా ఇక ఫ్యూచర్ కూడా ఈ దర్శకుల మీదనే డిపెండ్ అవ్వబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. వాళ్ళు ఎవరు అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
సందీప్ రెడ్డి వంగ
అర్జున్ రెడ్డి తో పెను ప్రభంజనాన్ని సృష్టించిన సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమాతో మరోసారి పాన్ ఇండియాను షేక్ చేశాడు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఒక తెలుగు దర్శకుడు వెళ్లి అక్కడ రికార్డులను బ్రేక్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆయన వెళ్లి సినిమా తీసి అక్కడి ప్రేక్షకుల చేత ప్రశంసలను అందుకున్నాడు. ఇక మొత్తానికైతే ప్రేక్షకులు సందీప్ రెడ్డి వంగ కి బ్రహ్మ రథం పడుతున్నారనే చెప్పాలి. ఇక ఇప్పుడు స్పిరిట్ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను సాధించడానికి రెడీ అవుతున్నాడు…
ప్రశాంత్ నీల్
కెజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ను అందుకొని చాలా తక్కువ టైంలోనే స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వాళ్లలో ప్రశాంత్ నీల్ ఒకరు. ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ అనే సినిమాకి ప్రణాళికలను రూపొందించుకుంటున్నాడు. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా సూపర్ సక్సెస్ ని సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ప్రభాస్ తో చేసిన సలార్ సినిమా గత సంవత్సరం వచ్చి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. కాబట్టి ఆయన కూడా ఇక రాబోయే సినిమాలతో పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నాడు అనేది మాత్రం చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది…
లోకేష్ కనకరాజ్
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వాళ్ల లోకేష్ కనక రాజ్ మొదటి స్థానం లో ఉంటాడు. ఇక ఈయన కన్ల్మల్ హాసన్ తో చేసిన విక్రమ్ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక మధ్యలో లియో సినిమా కొంతవరకు నిరాశపర్చినప్పటికీ ఆయన మేకింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఇప్పుడు రజనీకాంత్ తో చేస్తున్న కూలీ సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ను అందుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…