https://oktelugu.com/

Devara Collection: అంచనాలను దాటేసిన ‘దేవర’..మొదటి రోజు ఎంత వసూళ్లు వచ్చాయో తెలుసా? రాజమౌళి కి కూడా అసాధ్యమే!

ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒక్కసారి లెక్క చూస్తే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 19 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన వసూళ్లు కాదు, కల్కి చిత్రానికి 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే ఈ చిత్రం ఆ రికార్డు ని అధిగమించింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 28, 2024 / 01:27 PM IST

    Devara Collection

    Follow us on

    Devara Collection: ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఆరంభం లో డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ షోస్ గడిచే కొద్దీ టాక్ మెరుగుపడుతూ వచ్చింది, ఫలితంగా బంపర్ ఓపెనింగ్స్ దక్కాయి. ట్రేడ్ వర్గాలు ఈ చిత్రానికి కేవలం 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వస్తాయని ముందుగా అనుకున్నారు. కానీ ఎవ్వరూ ఊహించని రీతిలో ఈ చిత్రానికి 162 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు. #RRR మరియు కల్కి చిత్రాలకు తప్ప మరో తెలుగు పాన్ ఇండియన్ సినిమాకి ఈ స్థాయి ఓపెనింగ్ వసూళ్లు ఇప్పటి వరకు రాలేదు. ఇది కేవలం జూనియర్ ఎన్టీఆర్ మాస్ క్రేజ్ వల్ల వచ్చిన ఓపెనింగ్ వసూళ్లు అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒక్కసారి లెక్క చూస్తే నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి 19 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన వసూళ్లు కాదు, కల్కి చిత్రానికి 19 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే ఈ చిత్రం ఆ రికార్డు ని అధిగమించింది. ఇక రాయలసీమ ప్రాంతం లో ఎన్టీఆర్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందరూ ఊహించినట్టు గానే ఈ చిత్రానికి ఈ ప్రాంతం నుండి 10 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. #RRR చిత్రం తర్వాత ‘దేవర’ కు మాత్రమే ఈ ప్రాంతం లో డబుల్ డిజిట్ షేర్ వసూళ్లు వచ్చాయి.

    అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం లో 5 కోట్ల 45 లక్షల రూపాయిలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3 కోట్ల 45 లక్షల రూపాయిలు, గుంటూరు జిల్లాలో 6 కోట్ల 27 లక్షల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 3 కోట్ల రూపాయిలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 4 కోట్ల రూపాయిలు, ఇలా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 54 కోట్ల 21 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు రాగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వెర్షన్ మొత్తానికి కలిపి 87 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. అలాగే హిందీ వెర్షన్ వసూళ్లు కూడా చాల డీసెంట్ గా వచ్చాయి. ఆరంభం లో అభిమానులు కూడా పెద్ద వసూళ్లు రావని అనుకున్నారు కానీ, అక్కడి ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు 7 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా అన్ని ప్రాంతాలకు కలిపి ఈ సినిమాకి మొదటి రోజు 95 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు ట్రేడ్ వసూళ్లు. జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ కి దాదాపుగా 50 శాతం రికవరీ మొదటి రోజే వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు.