Devara 2 : #RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్(Junior NTR) నటించిన ‘దేవర'(Devara Movie) చిత్రం గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. ప్రారంభం లో కాస్త డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత నుండి సినిమా చిన్నగా పికప్ అవ్వడం, దానికి తోడు దసరా సెలవులు కూడా బాగా కలిసిరావడంతో ఈ చిత్రం దాదాపుగా 400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అయితే మొదటి రోజు ఈ చిత్రానికి ఏకంగా 160 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వచ్చిన ఓపెనింగ్ కి పడిన క్లోజింగ్ కి సంబంధం లేకుండా ఉన్నప్పటికీ రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్ సినిమాలన్నిటి కంటే మంచి లాంగ్ రన్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిల్చింది ఈ చిత్రం.
Also Read : దేవర 2 ఉందా లేదా? ఇదిగో క్లారిటీ!
అయితే ఈ సినిమాకి రెండవ భాగం కూడా ఉందని డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) ఎప్పుడో చెప్పాడు. క్లైమాక్స్ లో దేవర కొడుకు ‘వర’ నే దేవర ని చంపినట్టు చూపించి పెద్ద ట్విస్ట్ ఇస్తాడు డైరెక్టర్. ఎందుకు ‘దేవర’ ని సొంత కొడుకే చంపాల్సి వచ్చింది?, అసలు ఏమైంది అనేది ఆసక్తి కరమైన అంశమే అయినప్పటికీ, రెండవ భాగానికి సరిపడ స్టోరీ ఎక్కడుంది?, ఎంత చూపించినా ఇక ‘వర’ మీదనే సినిమా మొత్తం నడిపించాలి. విలన్ వద్ద ఇప్పటికీ అతను అమాయకంగానే కనిపించబోతున్నాడని క్లైమాక్స్ షాట్ చూస్తే అర్థం అవుతుంది. ఇలాంటి స్క్రీన్ ప్లే తో ఎన్నో వందల సినిమాలు వచ్చాయి, కాబట్టి ఎదో మాటవరుసకి సీక్వెల్ అని ప్రకటించారు కానీ, నిజానికి సీక్వెల్ రాదంటూ అనేక మంది విశ్లేషకులు కామెంట్స్ చేసారు. కానీ నిజంగానే ఈ సినిమాకి సీక్వెల్ ఉందట. రీసెంట్ గా కొరటాల శివ ఎన్టీఆర్ ని కలిసి స్క్రిప్ట్ ని వివరించాడట.
ఎన్టీఆర్ చెప్పిన కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలెట్టి, సెప్టెంబర్ నెల నుండి సీక్వెల్ ని పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి అట. సీక్వెల్ లో కొత్త కొత్త పాత్రలు ఎంట్రీలు ఇస్తారని, ఊహకందని ట్విస్టులు ఈ రెండవ భాగం లో చూడబోతారని, ఫ్యాన్స్ కి అయితే విజువల్ ఫీస్ట్ లెక్క ఉండబోతుందని, అంతే కాకుండా ఈ చిత్రం లో ఇద్దరు యంగ్ హీరోలు కూడా కీలక పాత్రలు పోషించబోతున్నారని, ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఉగాదికి ఈ సినిమా టీం నుండి ఒక సర్ప్రైజ్ ఉండే అవకాశం ఉందని, ఫ్యాన్స్ కి అది పండగ వాతావరణం ని క్రియేట్ చేస్తుందని అంటున్నారు. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు.
Also Read : దేవర 2 లో పెద్ద ఎన్టీయార్ (దేవర) బతికే ఉంటాడా..? అసలు ట్విస్ట్ చెప్పేసిన కొరటాల శివ…