https://oktelugu.com/

Shyam Singaroy Movie: ఆ పాత్రలకి ఫేమస్ అయిన శ్యామ్ సింగరాయ్ మూవీ విలన్… ఏవంటే ?

Shyam Singaroy Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం “శ్యామ్ సింగరాయ్”. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ కూడా ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మించారు. నాని కేరీయ‌ర్ లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో తీసిన మూవీ ఇదే కావ‌డం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 4, 2022 / 10:39 AM IST
    Follow us on

    Shyam Singaroy Movie: నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించిన చిత్రం “శ్యామ్ సింగరాయ్”. టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ కూడా ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌ ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మించారు. నాని కేరీయ‌ర్ లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో తీసిన మూవీ ఇదే కావ‌డం విశేషం. క్రిస్మస్ సందర్భంగా డిసెంబ‌ర్ 24 తెలుగు తో పాటు త‌మిళ, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో పాన్ ఇండియా రెంజ్ లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఫస్ట్ డే నుంచే ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని… మంచి వసూళ్ళతో దూసుకుపోతోంది.

    కాగా ఈ సినిమాలో మహంత్ అనే పాత్రలో విలన్ గా మనీష్ వాధ్వా నటించారు. ఈ సినిమాలో మనీష్ కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ అతని పాత్రతో అందరినీ ఆకట్టుకున్నాడు. 1972లో ముంబైలో జన్మించిన మనీష్ వాధ్వా ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత బుల్లితెర నటుడుగా చాణక్యుడు పాత్రలతో ఫేమస్ అయ్యాడు. ఆ పాత్రలలో ఆయన్ని తప్ప మరొకరిని ఊహించుకోలేము అనేంతలా మెప్పించారు. చంద్రగుప్తమౌర్య, పద్మవాతార్ శ్రీకృష్ణ వంటి సీరియల్స్ లలో నటించి నటుడుగా ఆడియన్స్ లో మంచి పేరు సంపాదించుకున్నాడు మనీష్.

    బాలీవుడ్ లో మణికర్ణిక, పద్మవత్ సినిమాలలో నటించాడు. ఆ తర్వాత శ్యామ్‌‌ సింగరాయ్ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. టాలీవుడ్‌లో పనిచేయాలనేది తన కల అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు మనీష్ వాధ్వా. శ్యామ్‌‌ సింగరాయ్ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే తెలుగులో మరో సినిమా అవకాశం వచ్చిందని, త్వరలోనే ఆ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన వెల్లడించారు.