Tollywood Hero Heroines: సినిమాల్లో విజయాలు అపజయాలు అనేవి సర్వసాధారణం. ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు. కానీ హిట్ అయితే మాత్రం ఆ సినిమాలో నటించిన వాళ్ళకి మంచి క్రేజ్ వస్తుంది. అదే ఫ్లాప్ అయితే క్క్రేజ్ తగ్గుతుందో లేదో తెలియదు కానీ ఆ ఫ్లాప్ ప్రభావం మాత్రం చాలా రోజులు వాళ్ళ ఇమేజ్ పై ఉంటది.
చిరంజీవి నుంచి నేటి నితిన్ వరకు వరుస ఫ్లాప్ ఎదురుకున్న నటీనటులు ఎంతోమంది. కొంతమంది కొన్ని ఫ్లాపులు రాగానే తెరమరుగై పోయారు, కానీ కొంతమంది నటులు మాత్రం అనేక ఫ్లాపులు వచ్చినా తట్టుకుని నిలదొక్కుకున్నాడు. అలా ఎన్ని ఫ్లాపులు వచ్చినా వెనక్కి తగ్గకుండా సినిమా ఇండస్ట్రీలో తిరిగి పుంజుకొని స్టార్ గా ఎదిగిన కొంతమంది నేటితరం నటీనటులను చూద్దాం.
అనుష్క (‘అరుంధతి’ టు ‘బాహుబలి’)
‘సూపర్’ సినిమాతో తెరంగేట్రం చేసి అరుంధతి తో మంచి హిట్ పొందిన నటి అనుష్క. కానీ అరుంధతి తర్వాత తనకు ఆ రేంజ్లో హిట్ బాహుబలి మాత్రమే తెచ్చిపెట్టింది. మధ్యలో ‘భాగమతి’ ఒక మంచి హిట్ ఇచ్చినప్పటికీ, భారీ హిట్ మాత్రం ఆమెకు బాహుబలి రూపంలో వచ్చింది. ఒక రకంగా బాహుబలి సినిమాని పక్కన పెడితే అనుష్క కి అరుంధతి రేంజ్ లో వచ్చిన విజయాలు ఏవీ లేవు.
పవన్ కళ్యాణ్ (‘ఖుషి’ టు ‘గబ్బర్ సింగ్’)
టాలీవుడ్ లో అత్యంత క్రేజ్ ఉన్న హీరోల్లో ప్రథమ స్థానంలో ఉంటారు పవన్ కళ్యాణ్. అతని పై అభిమానులకు ఉన్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేం. అంతటి క్రేజ్ ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాణ్ కి కూడా ఫ్లాపుల బాధ తప్ప లేదు. ఒక రకంగా ఇప్పుడున్న స్టార్ హీరోల్లో అనేక ఫ్లాపులను ఎదుర్కొన్న హీరోగా పవన్ కళ్యాణ్ ని చెప్పుకోవచ్చు. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్లు పొందిన పవన్ కళ్యాణ్ , ‘ఖుషి’ సినిమా తో భారీ బ్లాక్ బస్టర్ నీ అందుకున్నారు. అయితే ఖుషి సినిమా తర్వాత వచ్చిన ‘జానీ’ ఘోర పరాజయం పాలైంది. ఆ సినిమా నుంచి ఆయనకి ఫ్లాపుల వర్షం మొదలైంది. మధ్యలో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమా తో ఒక యవరేజ్ హిట్ ను అందుకున్న కానీ, ఆ సినిమా ఆయన రేంజ్ హిట్ గా మనం చెప్పుకోలేం. కాబట్టి ఖుషి తరువాత దాదాపు ఎనిమిది ఫ్లాపుల తర్వాత ఆయన ‘గబ్బర్ సింగ్’ రూపంలో ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా కానీ ఆయన క్రేజ్ తగ్గలేదు
బాలకృష్ణ ( ‘నరసింహనాయుడు’ టు ‘లక్ష్మీ నరసింహ’, లక్ష్మీ నరసింహా’ టు ‘సింహా’)
టాలీవుడ్ లో బాలకృష్ణ రికార్డులు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్, అఖండ లాంటి చిత్రాలతో నేటి తరం యువ స్టార్ హీరోలతో కూడా పోటీ పడ్డారు మన బాలయ్య. మరి అలాంటి బాలయ్య కూడా లక్ష్మీ నరసింహ నుంచి సింహ సినిమా వరకు అనేక ప్లాపులతో సతమతమయ్యారు. అంతే కాదు లక్ష్మీ నరసింహ ముందు కూడా బాలకృష్ణకు చాలా ఫ్లాపులు వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే నరసింహనాయుడు నుంచి లక్ష్మీనరసింహ మధ్యలో ఆయనకి యావరేజ్ గా మిగిలిన ఒకే ఒక చిత్రం చెన్నకేశవరెడ్డి. మిగతా సినిమాల అన్ని ఆయనకి ఘోర పరాజయాన్ని మిగిల్చాయి. ఎన్ని ఫ్లాపులు ఎదుర్కొన్నా బాలయ్య స్స్టార్ డమ్ మాత్రం చెక్కు చెదరలేదు.
కీర్తి సురేష్ (‘మహానటి’ టు ‘దసరా’ )
మహానటి తో అద్భుతమైన నటన ప్రదర్శించి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. అలాంటి కీర్తి సురేష్ కి మహానటి తర్వాత ఒక్క హిట్ కూడా లేదు. తను మధ్యలో చాలా సినిమాల్లో నటించినప్పటికీ అవి ఏవి ఆమెకు మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. కీర్తి కి ఈమధ్య నటించిన సర్కారు వారి పాట చిత్రం మాత్రమే ఒక యావరేజ్ సినిమాగా నిలిచింది. మరి నేటితరం మహానటికి ఇకనైనా ఒక భారీ హిట్ పడుతుందో లేదో చూడాలి.