Bigg Boss 6 Geetu Royal: బిగ్ బాస్ హౌస్ లో గీటూ రాయల్ సెకలు ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ప్రేక్షకులను ఆకర్షించాలన్న క్రమంలో ఆమె మరీ ఎక్కువ చేస్తున్నార్న వాదన వినిపిస్తోంది. క్లాస్-మాస్-ట్రాష్ టాస్క్ లో కూడా తోటి కంటెస్టెంట్స్ పై ఓ రేంజ్ లో అజమాయిషీ చలాయించింది. ఇనయ సుల్తానా చేత అడ్డమైన చాకిరీ చేయించుకుంది. చివరికి పాటలు పాడాలని ఆదేశించడంతో ఇనయ ఎదురు తిరిగింది. నీకు ఎలాంటి సర్వీస్ అయినా చేస్తాను, పాటలు, పద్యాలు పాడటం కుదరదని ఓపెన్ గా చెప్పేసింది.
గీతూ బిహేవియర్ హౌస్ లో చాలా మందికి నచ్చడం లేదు. నిన్న ఎపిసోడ్ లో కెప్టెన్ బాల ఆదిత్య పక్కనే కూర్చుంది. అతని ముఖం మీదకు వెళ్లేలా కాలు మీద కాలేసుకొని కూర్చొని ఊపుతుంది. నీకాలు నా ముఖం మీదకు వస్తుంది, ఊపకు అని బాల ఆదిత్య చెప్పాడు. ఏం నీ మూతిలో పెట్టి ఊపినానా? అని గీతూ చిరాకుగా ముఖం పెట్టి మాట్లాడింది. ఎవరి మూతిలో కాళ్ళు పెట్టినా తప్పే కదమ్మా.. అని బాల ఆదిత్య పద్దతిగా చెప్పాడు. నేను కాలు తీసేది లేదు. ఇలా ఊపడం నాకు అలవాటని గీర చూపించింది.
ఇక కెప్టెన్సీ టాస్క్ లో గీతూ చేసిన పనికి అందరూ అవాక్కయ్యారు. బిగ్ బాస్ బండి టాస్క్ లో కార్డ్స్ తన టీషర్ట్ లో వేసుకుంది. నువ్వు కార్డ్స్ అక్కడ పెట్టుకుంటే ఎలా తీసుకోవాలని తోటి కంటెస్టెంట్స్ అడిగారు. దానికి నేను అక్కడే పెట్టుకుంటా, అది నా గేమ్ స్ట్రాటజీ. కావాలంటే టీషర్ట్ లోపల నుండి తీసుకోండి, అంది. ఇది ఫెయిర్ గేమ్ కాదని అంటే… అవును నేను ఇలా అన్యాయంగానే ఆడతా ఇది నా గేమ్ అంటూ పొగరు సమాధానం చెప్పింది.
హౌస్ లో మెజారిటీ కంటెస్టెంట్స్ గీతూకి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ ప్రభావం వరస్ట్ కంటెస్టెంట్ గేమ్ లో బయటపడింది. చాలా మంది గీతూ వరస్ట్ కంటెస్టెంట్ గా స్టాంప్ వేశాడు. దీంతో ఆమె జైలుకి వెళ్లారు. అంతకంతకూ ప్రేక్షకుల్లో నెగిటివిటీ సంపాదించుకుంటున్న గీతూ రాయల్ త్వరగానే హౌస్ నుండి చెక్కేసే సూచనలు కలవు. రేవంత్ పుణ్యమా అంటూ క్లాస్ లోకి వెళ్లి నామినేషన్స్ నుండి తప్పించుకుంది. ఈ వారానికి గీతూ సేఫ్.