Amala Paul: సినిమా ప్రపంచం అంటేనే ఒక మాయ. ఆ రంగుల లోకంలో పైకి కనిపించేవేవీ నిజాలు కాదు. టన్నుల కొద్దీ హిపోక్రసీ ఉండే సినీ పరిశ్రమలో నటీనటులపై రకరకాల పుకార్లు వస్తుంటాయి. కొన్ని గాలికిపోయే పేలపిండిలా కొట్టుకుపోతాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం అవే నిజాలుగా బయటకు వస్తాయి. అందుకే నిజం నిప్పులాంటిదని, అది లేనిదే పొగ రాదని పెద్దలు అంటారు. ఈ క్రమంలోనే అలాంటి ఒక పుకారు సినీనటి అమలపాల్ మీద వచ్చింది. తమిళ దర్శకుడు విజయ్ తో విడాకులు తీసుకున్న తర్వాత అమలాపాల్ ఏది చేసినా వివాదాస్పదమవుతోంది. ఆమెపై వచ్చిన పుకారు కూడా అలాంటిదేనని అందరూ అనుకున్నారు. కానీ తవ్వినా కొద్దీ అసలు నిజం బయటికి రావడంతో అమలా పాల్ కు మైండ్ బ్లాంక్ అయింది.

..
తమిళ దర్శకుడు విజయ్ తో విడాకులు తీసుకున్న తర్వాత.. అమలాపాల్ కొద్దిరోజులు ఒంటరిగానే ఉంది. తర్వాత గాయకుడు భవ్ నిందర్ సింగ్ తో ప్రేమాయణం నడిపింది. ఇద్దరు కలిసి చాలా ప్రదేశాలు తిరిగివచ్చారు. ఆ తర్వాత పెళ్లికూడా చేసుకున్నట్టు సమాచారం. అయితే ఈ మధ్య వారిద్దరూ కటీఫ్ చెప్పుకున్నారు. ఇది ఇంతటితో ముగిసిపోతే బాగుండు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. భవ్ నిందర్ సింగ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని అమలాపాల్ చెన్నైలోని విల్లుపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అంతా బాగానే ఉందనుకున్న అమలాపాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. భవ్ నిందర్ సింగ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతడు కోర్టులో అమలాపాల్, తానూ పెళ్ళి చేసుకున్నట్టు కోర్టులో సాక్ష్యాధారాలు సమర్పించినట్టు సమాచారం. ఈ కారణంగానే అతడికి కోర్టు బెయిల్ మంజూరు చేసినట్టు కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

..
అసలు విషయం ఇదీ
..
తమిళ దర్శకుడు విజయ్ కి విడాకులు ఇచ్చిన తర్వాత అమలాపాల్ 2017లో పంజాబీ సింగర్ భవ్ నిందర్ సింగ్ ను పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ వాటిని ఆమె ఖండించింది. అవి కేవలం ఓ ప్రమోషన్ షూట్లో తీసినవని స్పష్టం చేసింది. కానీ సదరు భవ్ నిందర్ సింగ్ మాత్రం అవి నిజమైన వేనని, వాటికి సంబంధించిన సాక్ష్యాలను తాజాగా కోర్టులో సమర్పించినట్టు తెలిసింది. అతడి సాక్ష్యాధారాలను పరిశీలించి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేవలం లైంగిక ఆరోపణలే కాకుండా భవ్ నిందర్ సింగ్ తనను ఆర్థికంగా మోసం చేశారంటూ అమలాపాల్ ఆ ఫిర్యాదులో పేర్కొంది. గతంలో వీరిద్దరూ కలిసి “కడావర్” అనే సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఆ సినిమాలో అమలాపాల్ లీడ్ రోల్లో నటించింది. ప్రస్తుతం ఆ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. సినిమా నిర్మాణ సమయంలో తప్పుడు పత్రాలు చూపించి ప్రొడక్షన్ కంపెనీని తన వశం చేసుకున్నట్టు అమలాపాల్ ఆరోపిస్తోంది. అతనిపై చేసిన ఫిర్యాదులోనూ ఇదే విషయాన్ని ప్రస్తావించింది. అయితే వీరిద్దరూ విడిపోయాక గతంలో ఇద్దరు కలిసి సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరిస్తున్నట్టు ఆమె అంటున్నది. ఈ విషయాన్ని పేర్కొంటూ ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కాగా అమలాపాల్ వ్యవహారంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. అమలాపాల్ చెప్పినవన్నీ నిజాలైతే కోర్టు ఎలా బెయిల్ మంజూరు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.