Rajamouli And Puri Jagannadh: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లు ఎలివేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు.ఒకప్పుడు పూరి జగన్నాథ్ (Puri Jagannadh) వరుస సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించి స్టార్ డైరెక్టర్ గా వెలుగొందాడు. ప్రస్తుతం ఆయన జోరు కొంతవరకు తగ్గినప్పటికి మరోసారి తన సినిమాతో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి(Vijay Sethupathi) తో కలిసి ఆయన ఒక సినిమా చేస్తున్నాడు… ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయడమే కాకుండా ఒక డిఫరెంట్ జానర్ లో పూరి జగన్నాథ్ సినిమాను ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా పూరి జగన్నాథ్ సుకుమార్ మధ్య ఒక ఇంటర్వ్యూ అయితే జరిగింది. వీళ్ళిద్దరూ ఈ ఇంటర్వ్యూ లో సినిమాలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూనే వాళ్ళ పర్సనల్ కు సంబంధించిన విషయాలను కూడా చెప్పడం విశేషం… అయితే పూరి జగన్నాథ్ మాట్లాడుతూ తను ఇండస్ట్రీ కి రాకముందే రాజమౌళి తనకు తెలుసని మేమిద్దరం సినిమాలు చేయక ముందు నుంచి కూడా ఇండస్ట్రీలో తిరుగుతూ మాట్లాడుకునే వాళ్ళమని మాకు కృష్ణవంశీ పరిచయం చేశారంటూ ఆయన చెప్పాడు. ఇక రాజమౌళి గురించి తెలిసిన వెంటనే పూరి జగన్నాథ్ మీ నాన్న పెద్ద రైటర్ కదా అతనికి నన్ను ఒకసారి పరిచయం చేస్తావా అని అడిగాడట… దాంతో రాజమౌళి ఒకరోజు పూరి జగన్నాథ్ ని వాళ్ళ ఇంటికి లంచ్ కు పిలిచారట. అక్కడికి వెళ్లి దూరం నుంచి విజయేంద్ర ప్రసాద్ గారిని చూసారట.
Also Read: నాలుగు రోజులకోసారి రంగు వేసుకుంటున్నాను.. విరాట్ భయ్యా.. ఈ మాటలు తగలాల్సిన వాళ్ల కు తగిలాయి అంతే!
అప్పటికే ఆయన ఏదో బుక్ చదువుతూ తన లోకంలో ఉన్నాడట. సరే అని రాజమౌళి పూరితో నీకు పరిచయం చేస్తాను పద అని అనగానే పూరి మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదట. కారణమేంటంటే ఆయన ఏదో బుక్ చదువుతున్నారు. ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలా అన్నాడట…
అందుకే ఆయన్ని దూరం నుంచే చూసి వచ్చేసారట. మొత్తానికైతే రాజమౌళి – పూరి జగన్నాద్ ఇద్దరు సినిమా ఇండస్ట్రీలో వాళ్లు సినిమాలను చేయడానికి ముందు నుంచే మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతూ ఉండడం విశేషం… ఇక ప్రస్తుతం వీళ్ళిద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా ఉండడం వీరిద్దరికి మంచి అభిమానులు ఉండటం విశేషం…
ప్రస్తుతానికి రాజమౌళి పాన్ ఇండియాలో సినిమాలను చేయడమే కాకుండా పాన్ వరల్డ్ లో ఎక్కువగా ముందుకు దూసుకెళ్తుండడం విశేషం. ఆయన కనక మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లో సూపర్ సక్సెస్ ని సాధిస్తే తనకు తిరిగి ఉండదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక రాబోయే రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే బాధ్యతను కూడా రాజమౌళి గారే తీసుకున్నట్టుగా తెలుస్తోంది…