https://oktelugu.com/

Omicron in AP: టెన్షన్.. టెన్షన్.. ఏపీలో ఒమిక్రాన్ కలకలం.. అప్రమత్తమైన అధికారులు..

Omicron in AP:  దేశంలో కరోనా భయానక పరిస్థితులు మళ్లీ ఏర్పడ్డాయి. ఇక కొవిడ్ భయాలు పోయాయి అని అందరూ అనుకునే టైంలో ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మళ్లీ కొవిడ్ తెరపైకి వచ్చింది. ఏపీలో ఒమిక్రాన్ టెన్షన్ రోజురోజుకూ పెరిగిపోతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏపీలో ఒకే ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదైంది. కానీ, అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఇప్పటికే వచ్చిన విదేశీ ప్రయాణికులున్నారు. దాంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే విదేశీ ప్రయాణికుల ద్వారా […]

Written By:
  • Mallesh
  • , Updated On : December 16, 2021 / 05:28 PM IST
    Follow us on

    Omicron in AP:  దేశంలో కరోనా భయానక పరిస్థితులు మళ్లీ ఏర్పడ్డాయి. ఇక కొవిడ్ భయాలు పోయాయి అని అందరూ అనుకునే టైంలో ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మళ్లీ కొవిడ్ తెరపైకి వచ్చింది. ఏపీలో ఒమిక్రాన్ టెన్షన్ రోజురోజుకూ పెరిగిపోతుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఏపీలో ఒకే ఒక్క ఒమిక్రాన్ కేసు నమోదైంది. కానీ, అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఇప్పటికే వచ్చిన విదేశీ ప్రయాణికులున్నారు. దాంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే విదేశీ ప్రయాణికుల ద్వారా కొత్త వేరియంట్ కేసులు వచ్చాయనే ప్రచారంతో స్థానికులు మరింతగా భయపడిపోతున్నారు.

    Omicron in AP

    ఏపీలోని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్.. కోనసీమకు చెందిన ఓ యువకుడికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అయితే, అది ఒమిక్రాన్ వేరియంట్ అని స్థానికంగా ప్రచారం కావడంతో జనాలు భయపడిపోతున్నారు. అధికారుల వివరాల ప్రకారం.. ఈ తూర్పుగోదావరి జిల్లాకు ఇప్పటి వరకు 2,746 మంది విదేశీ ప్రయాణికులు వచ్చారు. వారిలో 2,673 మందిని గుర్తించారు. వారిలో 928 మందికి కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా ముగ్గురికి మాత్రమే పాజిటివ్‌గా తేలింది. అయితే, వీరికి వచ్చిన కరోనా పాజిటివ్ కేసు అనేది ఒమిక్రాన్ వేరియంట్ కాదని అధికారులు పేర్కొంటున్నారు. కానీ, స్థానికంగా ఒమిక్రాన్ వేరియంట్ అనే కలకలం రేగింది. దాంతో జనాలు ఇంకా హడలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

    ఏపీ సర్కారు తాజాగా విడుదల చేసిన బులెటిన్‌లో కొవిడ్ కేసులు తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా ఉన్నాయి. దాంతో ఆ జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. అయితే, విదేశాల నుంచి వచ్చిన వారందరికీ ఒమిక్రాన్ వేరియంట్ కొవిడ్ వచ్చిందన్న విషయంలో నిజం లేదని, అటువంటి విషయాలను ప్రజలు నమ్మొద్దని అధికారులు పేర్కొంటున్నారు.

    Also Read: RK Roja: రోజాకు చెక్ పెట్టేందుకు అసమ్మతి వర్గం రెడీ?

    అధికారులు చెప్తున్న ప్రకారం.. ఇటీవల విజయనగరం డిస్ట్రిక్ట్‌కు చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే, అతనికి ట్రీట్ మెంట్ తర్వాత వైరస్ నెగెటివ్ అయింది. కాగా, అధికారులు ఒమిక్రాన్ వేరియంట్ కేసుల గురించి జనం భయపడొద్దని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు.

    Also Read: Cold Intensity: తెలంగాణ‌, ఏపీలో చ‌లి పులి.. దారుణంగా ప‌డిపోతున్న ఉష్ణోగ్ర‌త‌లు..!

    Tags