https://oktelugu.com/

స్టార్ రేంజ్ లో డిమాండ్.. అయినా అవమానాలే.. పాపం !

ఒక్కొక్కరిది ఒక్కో బాధ అయితే, మ్యూజిక్ డైరెక్టర్ ‘తమన్’ది మాత్రం ఎప్పుడూ ఒకే బాధ అయిపోయింది. అసలు తెలుగు ఇండస్ట్రీలో కాపీ క్యాట్ అనగానే ముందుకు గుర్తుకొచ్చే పేరు ‘తమనే’ అంటున్నారు టాలీవుడ్ జనం. దాంతో, తానే సొంతగా కంపోజ్ చేసిన పాటల పై కూడా ఈ మధ్య దర్శకనిర్మాతలు డౌట్ పడుతున్నారట. చేసేది పెద్ద సినిమాలు.. పైగా వందల కోట్ల వ్యాపారం.. అందుకే ఎందుకు రిస్క్ ? దయచేసి కాపీ వ్యవహారాలు మన సినిమా వరకూ […]

Written By:
  • admin
  • , Updated On : March 6, 2021 / 05:01 PM IST
    Follow us on


    ఒక్కొక్కరిది ఒక్కో బాధ అయితే, మ్యూజిక్ డైరెక్టర్ ‘తమన్’ది మాత్రం ఎప్పుడూ ఒకే బాధ అయిపోయింది. అసలు తెలుగు ఇండస్ట్రీలో కాపీ క్యాట్ అనగానే ముందుకు గుర్తుకొచ్చే పేరు ‘తమనే’ అంటున్నారు టాలీవుడ్ జనం. దాంతో, తానే సొంతగా కంపోజ్ చేసిన పాటల పై కూడా ఈ మధ్య దర్శకనిర్మాతలు డౌట్ పడుతున్నారట. చేసేది పెద్ద సినిమాలు.. పైగా వందల కోట్ల వ్యాపారం.. అందుకే ఎందుకు రిస్క్ ? దయచేసి కాపీ వ్యవహారాలు మన సినిమా వరకూ దూరంగా ఉంచండి అని తమన్ మొహం మీద చెబుతున్నారట.

    Also Read: పెళ్లి బాధలో మరో ముదురు భామ !

    పాపం తమన్.. పేరుకి పెద్ద మ్యూజిక్ డైరెక్టర్.. పైగా ఫుల్ సక్సెస్ లో ఉన్నాడు. అయినా అవమానాలు బాధలు మాత్రం ఈ మధ్య మరీ ఎక్కువ అయిపోతున్నాయట. తానూ ఎంతో కష్టపడి కాపీ కొట్టి ఒక పాటను రిలీజ్ చేస్తే.. వెంటనే దీని ఒరిజినల్ పాడండ్రా అంటూ కావాలని నా పై ట్రోల్ మొదలు పెడుతున్నారని.. నెటిజన్ల పేరుతో కొంతమంది చేస్తోన్న కుట్ర ఇది అని ఆ మధ్య తమన్ ఇన్ డైరెక్ట్ గా దేవి పై కొన్ని ఆరోపణలు చేశాడు.

    ఆ ఆరోపణల్లో ఎంత నిజం ఉందనేది పక్కన పెడితే.. ఒక్కటి మాత్రం నిజం. తమన్ నుండి ఎలాంటి పాట వచ్చినా.. అది ఎక్కడో ఓ చోట నుంచి తమన్ కాపీ కొట్టినట్టు సాక్ష్యాలు దొరుకుతున్నాయి. సూపర్ హిట్ పాటలను కూడా, కాపీ కొట్టాడనే విమర్శలు అందుకున్న ఘనత మాత్రం ఈ జనరేషన్ లో ఒక్క తమన్ కే దక్కింది. ఇలా తన పై వస్తోన్న విమర్శలకు తమన్ ఎప్పటికప్పుడు వివరణ ఇచ్చుకుంటున్నా అతని పై కాపీ క్యాట్ అనే ముద్ర మాత్రం రోజురోజుకూ బలపడుతుంది.

    Also Read: ముసలాడిగా రవితేజ.. మళ్ళీ ప్రేమ కథ కూడా !

    అసలు ఆ మాటకొస్తే.. తమన్ ఇప్పుడు ఏదో కొత్తగా కాపీ చేయడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా వస్తోన్న తంతంగమే ఇది. అయినా స్టార్ హీరోలు తమన్ కే ఛాన్స్ లు ఇస్తున్నారు. కారణం, సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడమే. కాపీ చేస్తే మాకు ఏమి, మాకు హిట్ కావాలి అంతే అన్నట్టు ఉంటుంది హీరోల వ్యవహారం. ఇక త‌న‌ పై విమ‌ర్శ‌లూ, ట్రోల్సూ మొద‌లైన తమన్ మాత్రం తన శైలి కాపీని మాత్రమే నముకుని ముందుకుపోతున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్