Unstoppable with NBK : ఆహా మీడియా లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ టాక్ షో ఎంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే..ఈ షో లో టాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖ సెలబ్రిటీస్ మరియు స్టార్ హీరోస్ వచ్చి బాలయ్య బాబు తో కాసేపు సరదాగా చిట్ చాట్ చేస్తుంటారు..బాలయ్య బాబు అడిగే బోల్డ్ ప్రశ్నలకు సెలెబ్రిటీలు బోల్డ్ గానే సమాధానం చెప్తూ ఉంటారు.

అలా ఈ షో బాగా క్లిక్ అయ్యింది..మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , ప్రభాస్ , అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు కూడా ఈ ఎపిసోడ్ లో పాల్గొన్నారు..అలా ఇండియాలోనే బిగ్గెస్ట్ టాక్ షో గా మారి హైయెస్ట్ రేటింగ్స్ ని సాధించింది..అయితే ఈ టాక్ షోకి సంబంధించిన ఎపిసోడ్స్ ఆహా మీడియా స్ట్రీమింగ్ కాకముందే సోషల్ మీడియా లో ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు లీక్ అవుతున్నాయి.
రీసెంట్ గానే ఈ షో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.. ఆయన సెట్స్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి లోపల బాలయ్య ఆయనని అడిగే ప్రశ్నల వరకూ ప్రతీ ఒక్కటి సోషల్ మీడియా లో లీక్ అయ్యాయి..ఇది గమనించిన ఆహా టీం హై కోర్ట్ ని ఆశ్రయించి పిటిషన్ వేసింది..తమ షో ని అనధికారికంగా చాలా మంది సోషల్ మీడియా లో ప్రసారం చేస్తున్నారని..దీనివల్ల వాణిజ్యంగా మేము ఎంతో నష్టపోతున్నాము.
తక్షణమే ఇలాంటివి జరగకుండా ఉండేందుకు గాను ‘ఇంజక్షన్’ ఆర్డర్ ని జారీ చెయ్యాలని కోర్ట్ ని రిక్వెస్ట్ చేసుకున్నారు.. న్యాయవాదులు ఈ పిటిషన్ ని పరిశీలించిన తర్వాత కోర్టు తక్షణమే అనధికారిక ప్రసారాలను నిలిపివేయాలని, సోషల్ మీడియా లో ఎపిసోడ్స్ ప్రసారం కాకముందే ఎవరైనా ఆ షో కి సంబంధించి వీడియోలు మరియు ఫోటోలు అప్లోడ్ చేసినా కఠినచర్యలు తప్పవని ఈ సందర్భంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.