https://oktelugu.com/

బ్రేకింగ్ : డ్రగ్స్ కేసులో నలుగురు స్టార్ హీరోయిన్లకు సమన్లు !

డ్రగ్స్ కేసులో గత కొన్ని రోజులుగా అనుకున్నదే జరిగింది. రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారించగా.. ఆమె సంచలన విషయాలనే అధికారుల మందు బయటపెట్టిందని అనుమానాలు ఉన్నా.. ఎవరెవరి పేర్లు చెప్పింది అనేది ఇప్పటివరకూ క్లారిటీగా తెలియలేదు. కానీ, ఇప్పుడు రియా చెప్పిన పేర్లు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ప్రకంపనాలు వచ్చినట్టు అయింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు […]

Written By:
  • admin
  • , Updated On : September 23, 2020 / 07:48 PM IST
    Follow us on


    డ్రగ్స్ కేసులో గత కొన్ని రోజులుగా అనుకున్నదే జరిగింది. రియా చక్రవర్తిని డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారించగా.. ఆమె సంచలన విషయాలనే అధికారుల మందు బయటపెట్టిందని అనుమానాలు ఉన్నా.. ఎవరెవరి పేర్లు చెప్పింది అనేది ఇప్పటివరకూ క్లారిటీగా తెలియలేదు. కానీ, ఇప్పుడు రియా చెప్పిన పేర్లు బయటపడ్డాయి. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ప్రకంపనాలు వచ్చినట్టు అయింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ లకు డ్రగ్స్ డీలర్స్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని రియా చక్రవర్తి ఎన్సీబీ అధికారులకు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. ఆమె వారి పేర్లు చెప్పిందని.. దీపికా, సారా, శ్రద్ధా, రకుల్ కు ఎన్సీబీ అధికారులు సమన్లు పంపిస్తారనే వార్త బాలీవుడ్ మీడియాలో ఈ రోజు బాగానే హల్ చల్ చేసింది.

    Also Read: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నిర్మాతకు లింకులు?

    అయితే అందరూ అనుకున్నట్టుగానే ఎన్సీబీ అధికారులు పైన చెప్పిన స్టార్ హీరోయిన్లకు తాజాగా సమన్లు జారీ చేసి వారికి షాక్ ఇచ్చారు. మూడు రోజుల్లో డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కావాలని దీపికా, సారా, శ్రద్ధా, రకుల్ లను ఎన్సీబీ అధికారులు ఆదేశించారు. దీంతో బాలీవుడ్ సినీ ప్రముఖుల్లో టెన్షన్ మొదలైంది. ఈ హీరోయిన్స్ తో పాటు ఇంకా చాలామంది మీద అనుమానాలు ఉన్నాయట. స్టార్ హీరోల మీద కూడా అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు కాస్త డ్రగ్స్ కేసుకు టర్న్ అయి బాలీవుడ్ ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. మొదటి నుండి డ్రగ్స్ విషయంలో బాలీవుడ్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అందుకే అధికారులు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అనుమానం ఉన్న అందర్నీ విచారణకు పిలుస్తున్నారు.

    Also Read: బబ్లీ బ్యూటీ ‘రాశి ఖ‌న్నా’కు అదిరిపోయే ఛాన్స్ !

    కాగా ఇప్పటివరకూ ఎన్సీబీ అధికారులు రియా చక్రవర్తితో పాటు ఆమె సోదరుడు సోవిక్ ను, అలాగే సుశాంత్ సింగ్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరండాను, మరియు సుశాంత్ వ్యక్తిగత స్టాఫ్ అయిన దీపేశ్ సావంత్ లను కూడా అధికారులు అరెస్ట్ చేసి విచారించి వీరి నుండి విలువైన సమాచారాన్ని రాబడుతున్నారు. అలాగే ఇప్పటికే దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాశ్ కు కూడా ఎన్సీబీ అధికారులు సమన్లు జారీ చేసి విచారణకు పిలిచారు. ఇప్పుడు తాజాగా దీపికకు కూడా సమన్లు పంపించడం హాట్ టాపిక్ అయింది. వాట్సప్ సంభాషణ ఆధారంగా వీళ్లందరికీ సమన్లు జారీ చేసినట్టు తెలుస్తోంది.