https://oktelugu.com/

బబ్లీ బ్యూటీ ‘రాశి ఖ‌న్నా’కు అదిరిపోయే ఛాన్స్ !

టాలెంట్ లేకపోయినా గ్లామర్ ఉంది, ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఎక్స్ పోజింగ్ చేస్తోంది.. అందుకే బబ్లీ బ్యూటీ రాశి ఖ‌న్నా టాలీవుడ్ లో మంచి ఛాన్స్ లనే అందుకుని బాగానే క్యాష్ చేసుకుంది. అయితే రెండేళ్లుగా తెలుగులో రాశి ఖ‌న్నాకు చెపుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఈ బ్యూటీ హ‌వా టాలీవుడ్ లో కాస్త త‌గ్గుముఖం పట్టిందట. ఏమైనా చిన్న సినిమాల‌తో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల […]

Written By:
  • admin
  • , Updated On : September 23, 2020 / 07:41 PM IST
    Follow us on


    టాలెంట్ లేకపోయినా గ్లామర్ ఉంది, ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఎక్స్ పోజింగ్ చేస్తోంది.. అందుకే బబ్లీ బ్యూటీ రాశి ఖ‌న్నా టాలీవుడ్ లో మంచి ఛాన్స్ లనే అందుకుని బాగానే క్యాష్ చేసుకుంది. అయితే రెండేళ్లుగా తెలుగులో రాశి ఖ‌న్నాకు చెపుకోతగ్గ స్థాయిలో అవకాశాలు రావడం లేదు. ఈ బ్యూటీ హ‌వా టాలీవుడ్ లో కాస్త త‌గ్గుముఖం పట్టిందట. ఏమైనా చిన్న సినిమాల‌తో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల స‌ర‌స‌న వ‌ర‌స‌గా అవ‌కాశాలు పొంది.. స్టార్ హీరో ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది రాశీ. కానీ ఆ తరువాత బిగ్ స్టార్ హీరోల స‌ర‌స‌న మాత్రం ఎందుకో అవ‌కాశాలు సంపాదించ‌లేక‌పోయింది.

    Also Read: సీనియర్ నటి కస్తూరి కూడా లైగింక బాధితురాలేనా..!

    ఎన్టీఆర్ లాంటి హీరోతో హీరోయిన్ గా నటించినా.. ఆ సినిమాలో మ‌ల్టిపుల్ హీరోయిన్లు ఉండటంతో రాశి ఖన్నాకి సోలో హీరోయిన్ గా గుర్తింపు రాలేదు. దాంతో తెలుగులో ఏవరేజ్ రేంజ్ హీరోల‌తో మాత్ర‌మే రాశీ నటించగలిగింది. ఇప్పుడు అలాంటి సినిమాలు కూడా రావడంలేదట. తెలుగులో అవకాశాలు త‌గ్గుతున్నాయని అర్ధం చేసుకున్న ఈ బబ్లీ బ్యూటీ ప్రస్తుతం త‌మిళం పై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీనికితోడు గ‌త రెండేళ్ల‌లో త‌మిళంలో జ‌యం ర‌వి, విశాల్, విజ‌య్ సేతుప‌తి లాంటి హీరోలతో చెప్పుకోద‌గిన స్థాయిలోనే రాశి ఖన్నా సినిమాల‌ను చేసింది. ఈ క్ర‌మంలో రాశి ఖ‌న్నాకి అక్క‌డ అనుకోకుండా బాగానే స్టార్ డమ్ వచ్చింది.

    Also Read: ‘రష్మికా మండన్న’ వల్ల వారికి అసంతృప్తి !

    తమిళంలో తనకు వచ్చిన ఆ కొద్ది స్టార్ డమ్ ను.. మరింతగా ముందకు తీసుకుపోయేందుకు రాశి ఖ‌న్నా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోందట. ఈ క్రమంలోనే సూర్య త‌దుప‌రి సినిమాలో రాశి ఖ‌న్నా హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. సింగం సీరిస్ ద‌ర్శ‌కుడు హ‌రి డైరెక్ష‌న్ లో సూర్య చేయ‌బోతున్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రాశి ఖ‌న్నాకు అవకాశం రావడంతో అక్కడ ఫామ్ లో ఉన్న మిగిలిన హీరోలు కూడా ‘రాశి ఖ‌న్నా’కు అవకాశం ఇస్తున్నారట. సూర్య సినిమాతో పాటు తాజాగా స్టార్ హీరో అజిత్ సినిమాలోనూ రాశి ఖ‌న్నాకి మరో అదిరిపోయే ఛాన్స్ వచ్చింది. అజిత్ సరసన ఆమె హీరోయిన్ గా నటించనుంది. సూర్య, అజిత్ సినిమాలు హిట్ అయితే.. ఇక తమిళంలో ‘రాశీ ఖ‌న్నా’కు స్టార్ హీరోయిన్ అయిపోయే అవకాశం కూడా ఉంటుంది.