Deepika Padukone: అల్లు అర్జున్(Icon Star Allu Arjun), అట్లీ(Atlee) మూవీ షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళకముందు నుండే విపరీతమైన అంచనాలను ఏర్పాటు అయ్యేలా చేస్తుంది. ప్రతీ రోజు ఎదో ఒక అప్డేట్ ఈ సినిమా నుండి లీక్ అవ్వడం, అది సోషల్ మీడియా ట్రెండ్ అవ్వడం వంటివి మనం రోజూ చూస్తూనే ఉన్నాము. ఇకపోతే ఈ చిత్రం లో దీపికా పదుకొనే(Deepika Padukone) ఒక హీరోయిన్ గా నటిస్తుంది అనే వార్త మనం గత కొద్దిరోజులుగా వింటున్నాం. ఇది నిజమా కాదా అనే చిన్న అనుమానం అభిమానుల్లో ఉండేది. కానీ నిజమే అని నేడు స్పెషల్ వీడియో ద్వారా అధికారికంగా తెలిపింది మూవీ టీం. ఈ వీడియో కూడా మొదటి వీడియో లాగానే చూసే ఆడియన్స్ కి అసలు వీళ్ళు తీస్తున్నది పాన్ ఇండియన్ సినిమానా?, లేకపోతే పాన్ వరల్డ్ సినిమానా? అనే అనుమానం కలిగించేలా చేసింది.
Read Also: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ఇక పిల్లల చదువుకు ఈజీగా రుణం!
దీపికా పదుకొనే క్యారక్టర్ ఇందులో నార్మల్ హీరోయిన్ రోల్ లాగా ఉండదు అనేది మనకి ఈరోజు విడుదల చేసిన వీడియో ని చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. అల్లు అర్జున్ ఇందులో సూపర్ హీరో క్యారక్టర్ చూస్తున్నట్టుగానే, దీపికా పదుకొనే కూడా సూపర్ హీరోయిన్ క్యారక్టర్ చేస్తుందని తెలుస్తుంది. DC కామిక్స్ నుండి వచ్చిన వండర్ ఉమెన్ క్యారక్టర్ ఎంత ఫేమస్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మన ఇండియా లో కూడా ఈ క్యారక్టర్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు దీపికా పదుకొనే ఈ సినిమాలో చేయబోయే క్యారక్టర్ వండర్ ఉమెన్ క్యారక్టర్ కంటే పవర్ ఫుల్ గా ఉంటుందని అనిపిస్తుంది. ఆ స్కెచ్చులు చూస్తుంటే అందులో డ్రాగన్స్ ఉన్నాయి, విచిత్రమైన జంతువులు కూడా ఉన్నాయి. హీరోయిన్ క్యారక్టర్ వాటితో ఫైటింగ్ చేస్తున్నట్టుగా స్కెచ్చులు చూపించారు. అంటే ఆమె క్యారక్టర్ ఎంత వీరోచితంగా ఉంటుందో ఊహించుకోవచ్చు.
Read Also: పవన్ కళ్యాణ్ మంచితనం కారణంగానే ‘హరి హర వీరమల్లు’ వాయిదా పడిందా?
అల్లు అర్జున్ క్యారక్టర్ కి కూడా ఇంత ఎలివేషన్స్ ఇచ్చినట్టు గా అనిపించలేదు. హీరోయిన్ క్యారక్టర్ ఈ రేంజ్ లో ఉంటే, ఇక హీరో క్యారక్టర్ ఏ రేంజ్ లో ఉంటుందో మీ ఊహాశక్తికే వదిలేస్తున్నాం. ఇంకా ఈ చిత్రం లో జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ వంటి వారు కూడా ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా ఇదే రేంజ్ లో ఉంటాయా?, లేక మామూలుగా ఉంటుంది అనేది చూడాలి. కథ విషయానికి వస్తే రెండు వేరు వేరు ప్రపంచంలో జన్మించిన ట్విన్ బ్రదర్స్ కి సంబంధించిన స్టోరీ అట ఇది. కాన్సెప్ట్ అదిరింది కదూ. ఇందులో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అందులో ఒకటి విలన్ క్యారక్టర్. ముందుగా విలన్ రోల్ కోసం ఒక పాపులర్ హీరో ని తీసుకోవాలని అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ ఆ క్యారక్టర్ కూడా నేనే చేస్తాను అని చెప్పడంతో, ఒక ఛాలెంజ్ గా తీసుకొని డైరెక్టర్ ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేసాడట.