Sarangapani Jathakam OTT: కెరీర్ ప్రారంభం లో కమెడియన్ గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ప్రియదర్శి(Priya Darshi), ఈమధ్య కాలం లో హీరో గా మారి వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ‘బలగం’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న ఈ హీరో, ఈ ఏడాది ఆరంభం లో ‘కోర్ట్'(Court Movie) చిత్రంతో మరో భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే ఊపులో ఆయన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం లో ‘సారంగపాణి జాతకం'(Sarangapani Jathakam) అనే చిత్రం చేసాడు. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్, పాజిటివ్ రివ్యూస్ అయితే బాగానే వచ్చాయి కానీ, ఎందుకో ఆ టాక్ జనాల్లోకి బలంగా వెళ్లలేకపోయింది. ఫలితంగా ఈ చిత్రం కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిల్చింది. కోర్ట్ ఊపులో వీకెండ్ వరకు డీసెంట్ గ్రాస్ ని నమోదు చేయగలిగింది కానీ, ఆ తర్వాత మాత్రం దారుణమైన డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.
అయితే చాలా సినిమాలు థియేటర్స్ లో పెద్దగా ఆడకపోయినా, ఓటీటీ లో విడుదలైనప్పుడు మాత్రం మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటూ ఉంటాయి. అలా ఈ చిత్రం కూడా ఓటీటీ లో విడుదల అయ్యాక సూపర్ హిట్ అవుతుందని విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడ్డారు. అనేక మంది మూవీ లవర్స్ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూసారు కూడా. అలా ఎదురు చూసిన వాళ్లకు ఇప్పుడు ఒక శుభ వార్త.
ఈ చిత్రాన్ని 23 వ తేదీన, అనగా నేడు అర్థ రాత్రి నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్స్ లో చతికిలపడిన ఈ సినిమా కనీసం ఓటీటీ రిలీజ్ లో అయినా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి. ఈ చిత్రం లో ప్రియా దర్శి తో పాటు వైవా హర్ష, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ మేకింగ్ స్టైల్ నేటి తరం ఆడియన్స్ కి నచ్చి ఉండకపోవచ్చు. కానీ ఆయన మేకింగ్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. వాళ్లకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన వాళ్లకు కూడా మంచిగా టైం పాస్ అయ్యే సినిమానే. ఎలాగో ఈ వీకెండ్ కొత్త సినిమాలేవీ థియేటర్స్ లోకి రాలేదు. కాబట్టి వారం మొత్తం కష్టపడి పని వీకెండ్ లో చేసి ఓటీటీ సినిమాలు చూడాలి అనుకునేవాళ్లకు ఈ చిత్రం ఒక బెస్ట్ ఛాయస్, చూసి ఎంజాయ్ చేయండి.