సస్పెన్స్ వీడింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే పాన్ ఇండియా మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకోన్‌ను ఫైనల్ చేశారు. బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకోవడంతో పాటు వెయ్యి కోట్ల హీరోగా ఎదిగిన ప్రభాస్‌కు ఇప్పుడు బాలీవుడ్‌లోనూ విశేష ఆదరణ ఉంది. ఎంత ఖర్చుచేసినా దానికి రెట్టింపు కలెక్షన్స్ వస్తుంది కాబట్టి… ప్రభాస్ మూవీల విషయంలో నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు అలాగే, తన అల్లుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ప్రభాస్ 21వ మూవీని అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేశారు. దేశ వ్యాప్త గా మార్కెట్, ప్రభాస్ స్టామినాను దృష్టిలో ఉంచుకొని బడా హీరోయిన్ కావాలని నిశ్చయించుకున్నారు. దాంతో, చాలా మంది పేర్లు వినిపించాయి. కియారా అడ్వాణి అనుకున్నా చివరకు దీపిక పడుకొన్‌ను ఫైనల్ చేశారు. రాజుకు తగ్గ రాణి అని నాగ్ అశ్విన్ పేర్కొన్నారు.
Also Read: సల్మాన్‌తో చేయనంటే బెదిరించారు.. కంగనా
బాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న దీపిక రాకతో ఈ మూవీ రూపురేఖలు మారిపోయాయి. ‘బాహుబలి’ రేంజ్ టాక్ వచ్చింది. తెలుగులోనే కాకుండా హిందీ జనాలు కూడా ఈ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో దీపిక పదుకోన్ రెమ్యునరేషన్ గురించి కూడా ఆసక్తికర విషయాలు బయటికొస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించడానికి దీపికా ఏకంగా రూ. 30 కోట్లు డిమాండ్ చేసినట్లుగానూ, అందుకు చిత్రయూనిట్ అంగీకరించిందన్న వార్త హల్‌చల్ చేస్తోంది. బాలీవుడ్‌లో బడా హీరోయిన్‌గా ఉన్న దీపిక సాధారణంగా 10 నుంచి 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. లేడీ ఓరియంటెండ్ మూవీస్‌కు సైతం ఆమె 15 కోట్లలోపే తీసుకునేది. 10 కోట్లుగా ఉన్న పారితోషికాన్ని ఆమె రీసెంట్‌గానే 15 కోట్లు చేసిందని బాలీవుడ్ టాక్. అలాంటిది ప్రభాస్ మూవీ కోసం రెమ్యునరేషన్‌ను డబుల్ చేసిందని తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ హిందీ రైట్స్‌లో వాటా కూడా ఆడిగిందన్న వార్తలు వచ్చాయి. అందుకు నిరాకరించిన అశ్వినీదత్… గంపగుత్తంగా ఆమెకు 30 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఒక్క హీరోయిన్‌కే అన్ని కోట్లు ఇస్తే హీరో ప్రభాస్‌కు ఇంకెంత ఇచ్చారనే చర్చ మొదలైంది. ఏదేమైనా షూటింగ్ కూడా మొదలవకుండానే ఈ మూవీ ఇప్పుడు అందరి నోట్లో నానుతోంది. సినిమాలకు కావాల్సింది కూడా అదే. పబ్లిసిటీ ఎక్కువైతే.. అదే స్థాయిలో కలెక్షన్స్ వస్తుంటాయి.