https://oktelugu.com/

కరోనా రాకుండా స్టార్ హీరో ఇంటికి ప్లాస్టిక్‌ కంచె

కరోనా కష్టకాలంలో బాలీవుడ్‌కు ఈ ఏడాది ఏదీ కలిసిరావడం లేదు. కరోనా కారణంగా సినిమాలు, షూటింగ్స్‌ ఆగిపోయి ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. వివిధ కారణాలతో పలువురు ప్రముఖులు చనిపోయారు. మరోవైపు ముంబైలో కరోనా వైరస్ ఉధృతి మ‌రింత వేగంగా ఉంది. సినీ తారలు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇటీవలే అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడింది. బిగ్‌బీతో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్‌ల‌కు క‌రోనా సోకింది. వీరంతా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 21, 2020 / 02:45 PM IST
    Follow us on


    కరోనా కష్టకాలంలో బాలీవుడ్‌కు ఈ ఏడాది ఏదీ కలిసిరావడం లేదు. కరోనా కారణంగా సినిమాలు, షూటింగ్స్‌ ఆగిపోయి ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. వివిధ కారణాలతో పలువురు ప్రముఖులు చనిపోయారు. మరోవైపు ముంబైలో కరోనా వైరస్ ఉధృతి మ‌రింత వేగంగా ఉంది. సినీ తారలు కూడా క‌రోనా బారిన ప‌డుతున్నారు. ఇటీవలే అమితాబ్ బచ్చన్ కుటుంబం కరోనా బారిన పడింది. బిగ్‌బీతో పాటు అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్‌ల‌కు క‌రోనా సోకింది. వీరంతా ముంబై నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే, బిగ్‌బీ కుటుంబమే కరోనా బారిన పడడంతో బాలీవుడ్‌ ఉలిక్కి పడింది. ముంబై కేంద్రంగా ఉన్న బాలీవుడ్‌ ప్రముఖులు వెంటనే అప్రమత్తమవుతున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ బారిన ప‌డ‌కుండా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా, వైరస్‌ గాలి ద్వారా కూడా వ్యాప్తిస్తోందని ప్రపంచ ఆరోగ్య శాఖ హెచ్చరించింది.

    ముంబైలో కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకొని బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ఖాన్ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాడు. తనతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సరికొత్త ఆలోచన చేశాడు. తన బంగ్లా మన్నత్‌ చుట్టూ ప్లాస్టిక్‌ షీట్లతో క‌వ‌రింగ్ చేయించారు. ఈ బంగ్లాలో షారూఖ్‌తో పాటు ఆయన భార్య గౌరి, ముగ్గురు పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు, పనివాళ్లు ఉంటున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్న పలువురుకి వైరస్‌ సోకుతున్నందున లాభం లేదని.. బంగ్లా మొత్తాన్ని ట్రాన్స్‌పరెంట్‌ కవర్లతో కప్పేశాడు. కరోనా వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఇంట్లోకి వైరస్‌ రాకుండా ఇది అడ్డుగా ఉంటుంది. అలాగే, వ‌ర్షం నుంచి కూడా బంగ్లాకు రక్షణనిస్తోంది. ప్లాస్టిక్ కవర్లతో మన్నత్‌ను కప్పిన ఫొటోలు ఇప్పుడు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. షారుక్‌ ప్లాస్టిక్‌ కంచె ఐడియా బాగుందని పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

    Tags