Deepika Padukone Daughter Photos: ఇన్నాళ్లు మీడియా కు తమ కూతురు దువా ముఖాన్ని చూపించకుండా జాగ్రత్త పడుతూ వచ్చిన దీపికా పదుకొనే(Deepika Padukone), రణవీర్ సింగ్(Ranveer Singh) దంపతులు దీపావళి కానుకగా అభిమానులకు ఒక స్వీట్ సర్ప్రైజ్ ని అందించారు. తమ కూతురు దువా తో కలిసి దీపావళి సంబరాలు చేసుకుంటున్న ఫోటోలను కొన్ని ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అమ్మ ఒడిలో కూర్చొని పూజ గదిలో దేవుడికి క్యూట్ గా చేతులెత్తి దండం పెట్టడం, ఆ తర్వాత తన తల్లిదండ్రులతో కలిసి చక్కటి చిరు నవ్వుతో ఆ చిన్నారి కనిపించడం వంటివి చూసి అభిమానులు మురిసిపోతున్నారు. చిన్నారి తల్లి చూసేందుకు ఎంత క్యూట్ గా ఉందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్నారి పాప అచ్చం అమ్మలాగే ఉందని కొందరు, లేదు నాన్న లాగా ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఎట్టకేలకు అభిమానుల కోరిక ని తీరుస్తూ, దువా ని చూపించడం తో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది.
ఇక దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే, అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గానే రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొన్నది. మరోపక్క దీపికా స్పిరిట్ మరియు కల్కి 2 చిత్రాల నుండి తప్పుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారిన సంగతి తెలిసిందే. రోజుకి కేవలం ఆరు గంటలు మాత్రమే పని చేస్తానని, రెమ్యూనరేషన్ కాకుండా లాభాల్లో వాటాలు కావాలని, తన స్టాఫ్ మొత్తానికి తనతో సమానంగా రాయల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని, ఇలా బోలెడన్ని షరతులు పెట్టడం తో ఆమెని ఈ రెండు సినిమాల నుండి పక్కన పెట్టారు దర్శక నిర్మాతలు. అంతే కాదు దీపికా మీద కోపం తో ట్వీట్స్ కూడా వేశారు. ఈ వివాదం పై దీపికా పదుకొనే ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. తన పని తానూ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది.