https://oktelugu.com/

Karthika Deepam: షాకిచ్చిన రుద్రాణి కే మరో షాక్ ఇచ్చిన వంటలక్క!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. ఇంట్లో సౌందర్య వాళ్ళు, కార్తీక్ వాళ్ళు లేకపోవటంతో ఆదిత్య ఒంటరి వాళ్ళం అయ్యాము అని బాధ పడతాడు. ఇక మోనిత ఎలాగైనా ప్రియమణిని వెతకాలని దారిన పోయే వాళ్ళను ప్రియమణి గురించి అడుగుతుంది. అంతలోనే అక్కడ్నుంచి దీప బాబుని తీసుకొని వస్తుంది. బాబు ఏడవటంతో పక్కకు వెళ్లి బాబు ని ఊరుకోపెడుతుంది. వెంటనే మోనిత బాబు ఏడుపు గొంతు విని తన […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 12, 2022 / 08:59 AM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందంటే.. ఇంట్లో సౌందర్య వాళ్ళు, కార్తీక్ వాళ్ళు లేకపోవటంతో ఆదిత్య ఒంటరి వాళ్ళం అయ్యాము అని బాధ పడతాడు. ఇక మోనిత ఎలాగైనా ప్రియమణిని వెతకాలని దారిన పోయే వాళ్ళను ప్రియమణి గురించి అడుగుతుంది. అంతలోనే అక్కడ్నుంచి దీప బాబుని తీసుకొని వస్తుంది. బాబు ఏడవటంతో పక్కకు వెళ్లి బాబు ని ఊరుకోపెడుతుంది.

    Karthika Deepam

    వెంటనే మోనిత బాబు ఏడుపు గొంతు విని తన బాబు గుర్తుకు రావడంతో కాసేపు వెతుకుతుంది. ఇక తనకు ఆకలి కావడం తో అక్కడున్న హోటల్ కి వెళ్లాలని అనుకుంటుంది. కార్తీక్ హోటల్ లో పనిచేస్తూ తన వృత్తిని గుర్తుచేసుకొని బాధపడతాడు. యజమాని కాసేపు కార్తీక్ ను ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. మరోవైపు దీప రుద్రాణి అప్పు తీర్చాలని చీటీ కోసం వెళుతుంది.

    Also Read:  అపోలో నుంచి ఏఐజీకి మ‌ళ్లిన వీఐపీలు.. క‌రోనా వ‌స్తే ఇక్క‌డే ట్రీట్ మెంట్‌..

    అక్కడ చీటీ సక్సెస్ కావడంతో సంతోషపడుతుంది. కానీ చీటీ చేసే ఆవిడ కూడా రుద్రాణి మనిషే. ఇక కార్తీక్ పనితీరు యజమానికి నచ్చుతుంది. ఇలా చేస్తే మరో హోటల్ కూడా పెట్టవచ్చని ఆలోచనలో పడతాడు. కార్తీక్ ను పిలిచి మెచ్చుకుంటాడు. అంతలోనే అక్కడికి మోనిత వస్తుంది. కార్తీక్ లోపల ఉండటంతో అక్కడ పనిచేసే మరో వ్యక్తి కార్తీక్ ను కాసేపు విసిగిస్తాడు. మొదట ఆర్డర్ కోసం కార్తీక్ ను పంపించాలని అనుకుంటాడు.

    కానీ అతగాడు మోనిత చూసి ఫిదా అవటంతో మోనిత దగ్గరికి వెళ్తాడు. ఇక మోనిత ఆర్డర్ తీసుకుంటుండగా ఆ గొంతు విని కార్తీక్ మోనితను చూస్తాడు. మరోవైపు ఒకావిడ దీప దగ్గరికి వచ్చి రుద్రాణి తో జాగ్రత్తగా ఉండాలని.. రుద్రాణి తన పుట్టినరోజు సందర్భంగా మీ పిల్లల బట్టలు కుట్టిస్తుందని చెప్పటంతో దీప షాక్ అవుతుంది. తరువాయి భాగం లో దీప రుద్రాణి ఇంట్లో వంట చేస్తూ రుద్రాణికి పెద్ద షాక్ ఇస్తుంది.

    Also Read: బంగార్రాజు కొడుకు అనిపించుకున్న నాగచైతన్య.. అంద‌రి ముందే హీరోయిన్‌తో చిలిపి చేష్ట‌లు..