
దర్శక కేసరి దాసరి నారాయణ రావు గారు మనల్ని వదిలి వెళ్ళిపోయి అపుడే మూడు సంవత్సరాలైంది . అయన లేని లోటు తెలుగు సినీ పరిశ్రమలో స్పష్టంగా కనపడుతోంది. దాసరి నారాయణ రావు గారి గురించి ఆలోచించినపుడు ఒక వ్యక్తిలో ఇన్ని రకాల టాలెంట్లు ఉండటం సాధ్యమా అనిపిస్తుంది .
లాక్ డౌన్ లో పరవళ్లు తొక్కుతున్న మందుబాబులు
నటుడు , రచయిత , దర్శకుడు అనే మూడు శాఖలను సమాంతరంగా నడిపించిన దర్శక కేసరి దాసరి గారు…. .ప్రపంచ సినీ చరిత్రలోఒక వ్యక్తి సవ్యసాచిలా 151 సినిమాలు దర్శకత్వం వహించడమంటే మాములు విషయం కాదు అందుకే ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో తన పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకో గలిగాడు. ఆయన అనితర సాధ్యమైన ఎన్నో విజయాలను చవిచూశాడు. ఒకేరోజు మూడు చిత్రాలను డైరెక్ట్ చేసిన అనన్య సామాన్యుడు. దర్శక గురువుగా ఎందరో శిష్యులను తయారు చేసిన ఆశ్రమ వాసి . వినడానికే అబ్బురపడే విధంగా, ప్రపంచంలో మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో ” 88 “.మంది దర్శక శిష్యులను తయారుచేసిన ధన్యజీవి దాసరి నారాయణ రావు గారు ..
విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?
ఇక దాసరి గారి ఘనతకు నిదర్శనం గా ఎన్నో చిత్రాలు నిలిచాయి కేవలం 17 రోజుల్లో నిర్మించిన `చిల్లరకొట్టు చిట్టెమ్మ` చిత్రం సిల్వర్ జూబ్లీ ఆడింది అలాగే పది రోజుల్లో నిర్మించబడ్డ ” ఎం ఎల్ ఏ ఏడుకొండలు ” మూవీ 200 రోజులు ప్రదర్శింప బడింది అంతేకాదు ఈ చిత్రం నైజాం (తెలంగాణ ) ప్రాంతంలో సాధించిన వసూళ్లు ఈయన దర్శకత్వంలోనే వచ్చిన ” బొబ్బిలి పులి ” చిత్రం కంటే ఎక్కువ కావడం విశేషం . ఈ విషయం ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ రంగంలో ఉన్నవారు విశేషంగా చెప్పుకొనేవారు .