
యంగ్ హీరో రామ్ కెరీర్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో రామ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పూరి జగన్మాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బ్లాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీలో రామ్ కు జోడీగా నిధి అగర్వాల్, నభానటేష్ నటించారు. ఛార్మీ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించింది. ‘ఇస్మార్ట్ శంకర్’ భారీ విజయం సాధించడంతో ఈ మూవీకి పూరి జగన్మాథ్ సిక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే.వెండితెరపైనే కాకుండా బుల్లితెర, యూట్యూబ్లోనూ ‘ఇస్మార్ట్ శంకర్’ సత్తా చాటింది. ఏకంగా 100మిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.
అడ్డేడ్డే.. నోటికాడ చుక్కని లాగేశారు!
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత రామ్ ‘రెడ్’ మూవీ చేస్తున్నాడు. రొమాంటిక్ థ్రిల్లర్ గా కిషోర్ తిరుమల ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో రామ్ సరసన మాళవిక శర్మ, అమృత అయ్యర్, నివేథా పేతురాజ్ నటిస్తున్నారు. ఇటీవలే ఇటలీలో పాటల చిత్రీకరణ జరుపుకుంది. తదనంతరం కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సమయంలోనే రామ్ మరో కథకు గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2008లో వచ్చిన ‘రెడీ’ సినిమా సీక్వెల్లో రామ్ నటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
లాక్ డౌన్ లో పరవళ్లు తొక్కుతున్న మందుబాబులు
‘రెడీ’ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం సాధించింది. కాగా ప్రస్తుతం శ్రీను వైట్ల గత ఆరేళ్లుగా హిట్లులేక ప్లాపు దర్శకుడిగా ముద్ర వేయించుకున్నాడు. ఈ సమయంలో రామ్ ను కలిసి ‘రెడీ’ సీక్వెల్ కథను విన్పించగా ఒకే చేసినట్లు ఫిల్మ్ నగర్లో టాక్ విన్పిస్తుంది. రామ్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో ప్లాపు దర్శకుడికి అవకాశం ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో రామ్ దర్శకుడు శ్రీనువైట్లకు ఛాన్సివ్వడం పెద్ద రిస్కేనని అభిమానులు అంటున్నారు. అయితే రామ్ తీసుకున్న నిర్ణయం అతడికి కలిసొస్తుందా? లేదో తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే..!